movie reviews

దిల్ బేచారా రివ్యూ

దిల్ బేచారా

సినిమా :- దిల్ బేచారా  (2020)

నటీనటులు :- సుశాంత్ సింగ్ రాజ్ పుత్ , సంజన సంఘీ 

మ్యూజిక్ డైరెక్టర్:- ఏ. ఆర్ . రెహమాన్

నిర్మాతలు :- ఫాక్స్ స్టార్ స్టూడియోస్ 

డైరెక్టర్ :- ముకేశ్ చాబ్ర 

Dil bechaara review:: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చివరి చిత్రం దిల్ బేచారా ఈరోజు విడుదలయింది. ఈ చిత్రం సుశాంత్ చూడకుండానే చనిపోవడం చాలా బాధాకరమైన విషయం.  సుశాంత్ చివరి చిత్రం ప్రతి ఒక్కరూ చూడాలని డిస్నీప్లస్ హాట్ స్టార్లో ప్రేక్షకులందరికీ ఉచితంగా చూసే సదుపాయాన్ని చిత్ర బృందం కల్పించారు. ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం..

కధ:-

ఈ కథ జబ్దేశ్ పూర్ లో మొదలవుతుంది. కిజ్యిబాసు అనే అమ్మాయి గొంతు కాన్సర్ తో బాధపడుతూ ఆ వ్యాధితోనే కాలం గడిపేస్తూ ఉంటుంది. జీవితంలో ఆనందం అనే పదం ఉంటుందని తెలియకుండా జీవితం సాగించేస్తుంది. ముక్కులో ఆక్సిజన్ పైప్ లేకుంటే ప్రాణానికే ప్రమాదం కాబట్టి ఎప్పుడూ ఆక్సిజన్ సిలిండర్ తన వీపుకి తగిలించుకుని తిరుగుతుంటుంది. అదే సమయంలో “ఇమ్మాన్యూల్ రాజ్ కుమార్” జూనియర్ ( మ్యాన్నీ ) కిజ్యిబాసు జీవితంలోకి వచ్చి ఆమెని నవ్విస్తూ ఉంటాడు. ఇమ్మాన్యూల్ కి ఒక కాలు ఉండదు. అయినా కూడా పట్టుదలతో డాన్స్ చేస్తాడు. అలాగే హీరో అవ్వాలి అనుకుంటాడు. జీవితంలో ప్రతీదీ సాధించాలి అని అనుకుంటాడు. అలా కిజ్యిబాసు జీవితాన్ని కూడా సుఖమయం చేయాలనుకుంటాడు. 

అలా కొద్దిరోజులు గడవగా కిజ్యిబాసుకి ఒక మెయిల్ వస్తుంది. అందులో  తనకి ఎంతో ఇష్టమైన గీతరచయిత మీరు నన్ను కలవాలనుకుంటే పారిస్ రాగలరు అని ఉంటుంది. అయితే పారిస్ కి ఇమ్మాన్యూల్ మరియు కిజ్యిబాసు రెడీ అవుతున్న సమయంలో కిజ్యిబాసుకి ఉన్న కాన్సర్ ఎక్కువై హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది.ఇప్పుడు ఇమ్మాన్యూల్ మరియు కిజ్యిబాసు పారిస్ కి వెళ్తారా? కిజ్యిబాసుకి ఉన్న గొంతు కాన్సర్ తగ్గిందా లేదా? కిజ్యిబాసు జీవితంలో అనుకున్న లక్ష్యం నెరవేర్చుకుందా లేదా ? చివరికి వీరిద్దరు ఏమవుతారు ? ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే హాట్ స్టార్లో ఈ చిత్రం చూడాల్సిందే. 

* సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరియు సంజన తమ పాత్రలో జీవించేసారు. 

 * ఎక్కడ బోర్ కొట్టకుండా దర్శకుడు కథ రాసుకున్నాడు. 

 *పాటలు వినసొంపుగా మరియు గుర్తుండిపోయేలా ఉన్నాయి. 

 *సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.

*  ప్రొడక్షన్ విలువలు కూడా చాలా బాగున్నాయి.

*  ఎడిటింగ్ కూడా బాగా చేశారు. 

* బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకొంచెం బాగా చేస్తే బాగుండేది అనిపించింది.

* చిత్ర కథనం కొంచెం నెమ్మదిగా సాగుతుంది. 

ముగింపు :-

దిల్ బేచారా చిత్రం ప్రతి కుటుంబం మరియు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే చిత్రం. అయితే ఇదే సుశాంత్ చివరి చిత్రం అవడం చాలా బాధాకరం. సుశాంత్ నటన అందరికీ గుర్తుండిపోతుంది.సంజన కూడా బాగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. కథనం నెమ్మదిగా సాగే చిత్రం ఇది.కానీ సుశాంత్ తన నటనతో మీ అందరినీ మెప్పిస్తాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.మొత్తం మీద దిల్ బేచారా అందరి మనసుల్ని కట్టిపడేస్తుంది. 

రేటింగ్ :– 3/5

Watch movie on Hotstar

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button