Diabetes Unknown fact: డయాబెటిస్ రోగమా? లేక ఫార్మా కంపెనీల కోట్లలు దండుకునే వ్యాపారమా?
Diabetes Unknown fact : డయాబెటిస్ కేసులు ఇండియాలో రాను రాను విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో డయాబెటిస్ కేసులు ఎక్కువ నమోదు అవుతున్న దాంట్లో భారత్ రెండో స్థానంలో ఉంది. చైనా మొదటి స్థానంలో ఉంది. ఇండియాలో 2019లో జరిగిన సర్వేలో 7 కోట్ల 50 లక్షల మంది డయాబెటిస్ బారిన పడ్డట్టు తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా 2023లో కూడా డయాబెటిస్ పేషెంట్ల సంఖ్య డబల్ అయినట్లు కనిపిస్తుంది. తరచూ మూత్రం పోస్తే డయాబెటిస్ వచ్చిందని పూర్వం భావించేవారు కానీ ఇప్పుడు చాలామందికి తాము డయాబెటిస్ పడ్డట్టు కూడా తెలియడం లేదు. దీంతో మరణాలు చోటు చేసుకుంటున్నాయి.

వాస్తవానికి ఫుడ్ అనేది గ్లూకోస్ లాగా కన్వర్ట్ అయ్యి ఇన్సోలిన్ హార్మోన్ ని సేల్స్ లోకి పంపిస్తుంది. మొదట డయాబెటిస్ అంటే కిడ్నీలో ప్రాబ్లమ్ అని అనుకున్నారు కానీ ఆ తర్వాత కొందరు వైద్యుల రీసర్చ్ లో తేలింది ఏంటంటే… పాంక్రిస్ పనిచేయకపోవడం వల్ల డయాబెటిస్ వస్తుంది. ఈ డయాబెటిస్ అనేది ఎవరైతే శ్రమ చేయక అధిక బరువుతో ఉంటారో వారు డయాబెటిస్ బారిన పడతారు. సుమారు 776 బిలియన్ డాలర్లను ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ డిసార్డర్ ఉన్నవారు ఖర్చు చేస్తున్నారు. అమెరికాలో డయాబెటిస్ పై ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. అలాగే పలు ఫార్మాసిటికల్ కంపెనీలు డయాబెటిస్ పేషెంట్ లను దృష్టిలో ఉంచుకొని వేలకోట్ల ఇన్సులిన్ దందాను నడిపిస్తుంది. ప్రస్తుతం ఈ విషయం సర్వత్ర చర్చనీయంగా మారింది. వాస్తవానికి డయాబెటిస్ అనేది వ్యాధి కాదు ఒక డిసార్డర్… దీన్ని సరైన డైట్ వ్యాయామం చేసి కంట్రోల్లో ఉంచుకోవచ్చు. కానీ కొన్ని ఫార్మా కంపెనీలు ఈ డయాబెటిస్ ని అదునుగా చేసుకుని రకరకాల ట్రీట్మెంట్లతో కోట్లు దండుకుంటున్నారు.