telugu gods devotional information in telugu

దుర్గాదేవికి ఈ పూజలు చేయడం వల్ల మీరు కోరుకొనే కోరికలను అమ్మవారు ప్రసాదిస్తారు

దసరా అనగానే అత్యంత పవిత్రంగా జరుపుకొనే దుర్గ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకొని, ఆ అమ్మవారి కటాక్షంతో వారి వారి కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు.

పునాలను ఒక సారి నెమరు వేసుకుంటే నవరాత్రి అంటే అర్థం, ‘నవ’ అంటే నూతన అని, ‘రాత్రి’ అంటే జ్ఞానం అని అర్థం వస్తుంది. ఈ రెండింటిని పొందాలంటే భక్తులు అమ్మవారికి పూజలు జరపడం వల్ల  అవి ప్రసాదిస్తుంది.

ఈ నవరాత్రుల సమయంలో అమ్మవారికి ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలో  తెలుసుకొని, వాటిని పాటించి  అమ్మవారి దీవెనలు పొందండి.

1. మొదటి రోజు శైలపుత్రి:

మొదటి రోజు అమ్మవారు త్రిశూల దారాణిగా దర్శనమిస్తుంది. ఆ రోజు హిమవంతుని కుమార్తెగా, శైవపుత్రిగా నంది వాహనంపై దర్శనమిస్తుంది. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా పులగం సమర్పించడం ద్వారా భక్తులకు సకల శక్తి సామర్థ్యాలు,యశస్సును అందిస్తుంది.

2. రెండవరోజు బాలాత్రిపుర సుందరి:

రెండవరోజు  నాడు అమ్మవారు పరాశక్తి బాలా త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రోజునాడు 10 ఏళ్ళ లోపు పిల్లల్ని అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తే, అమ్మవారు సంతానాన్ని,మనోవికాసాన్ని అందిస్తుంది.

3. మూడవరోజు గాయత్రి దేవి:

గాయత్రి మంత్రం ‘ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌’ ఈ మంత్రం ఎంత శక్తివంతమైనదో మన అందరికి తెలుసు , ఈ మంత్రాన్ని జపిస్తే చతుర్వేద పారాయణం ఫలితం దక్కుతుంది. ఈ రోజునాడు అమ్మవారికి పాలతో చేసిన ప్రసాదాన్ని సమర్పించాలి.

4. నాలుగవ రోజు అన్నపూర్ణ దేవి:

ఈ నాలుగవ రోజునాడు అమ్మ వారిని అన్నపూర్ణ దేవిగా అలంకరించి పూజలు చేస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, పరమేశ్వరుడికే సాక్షాత్తు అమ్మవారు బిక్షపెట్టిన దేవత అన్నపూర్ణ దేవి.  ఈ తల్లిని ధ్యానిస్తే ఐశ్వర్య వృద్ధి, ధనధాన్యాభివృద్ది కలుగుతుంది.

5. ఐదవరోజు లలితాదేవి:

ఇరువైపులా లక్ష్మి సరస్వతులు నిలబడి వింజామర వీస్తుండగా లలితాదేవి భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రోజునాడు అమ్మవారికి సువాసిని పూజచేయాలి, ఎలా చేయడం వల్ల సమస్త సుఖాలను భక్తులకు అందిస్తుంది.

6. ఆరవ రోజు మహాలక్ష్మి:

రెండు చేతులలో కమలాలను ధరించి మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రూపం అష్టలక్ష్ముల సమిష్టి రూపం ఈ మహాలక్ష్మి. ఈ రోజునాడు అమ్మవారిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయి.

7. ఏడవ రోజు సరస్వతి:

చదువుల తల్లి సరస్వతీమాత ఈ ఏడవ రోజునాడు దర్శనమిస్తుంది. త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత్ సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ దేవతను ఆరాదిస్తే బుద్దిని,విద్యని అందిస్తుంది.  

8. ఎనిమిదవ రోజు దుర్గాదేవి:

పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటి రూపం దుర్గాదేవి రూపం. ఈ రోజునాడు అమ్మవారికి ఎర్రనీ వస్రం ,ఎర్రని అక్షింతలు,ఎర్రని పుష్పాలతో పూజించుట వలన శత్రు పీడా తొలగుతుంది.  

9. తొమ్మిదవ రోజు మహిషాసునమర్దిని:

ఈ అవతారాన్ని అమ్మవారి మహోగ్రరూపంగా కనబడుతుంది మహిషాసురుని సంహరించి మహాశక్తి రూపంగా దర్శనమిస్తుంది.  ఈ అమ్మవారిని పూజించడంవల్ల భయాలు తొలగి పోతాయి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button