Today Telugu News Updates
Dhoni : సరికొత్త బిజినెస్ లోకి ఎంటరైన ధోని !

ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రికెటర్ గా పేరుతెచ్చుకున్న ధోని ఇపుడు తన రిటైర్మెంట్ తర్వాత ఒక కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. చికెన్ అంటే అమితంగా ఇష్టపడే ధోని ఒక ఆర్గానిక్ పౌల్ట్రీ ఫామ్ ను ప్రారంభించానున్నాడు.
ఈ ఫామ్ కోసం 2000 వేయిలకు పైగా కడకనాథ్ కోడి పిల్లలను ఆర్డర్ చేసినట్టు , వీటికోసం ఝబువా జిల్లా థాండ్లా గ్రామంలోని వినోద్ మేధా అనే రైతును సంప్రదించారని సమాచారం.
రాంచీలోని తన 43 ఎకరాల ఫామ్ హౌస్‌లో ధోనీ చేపల ఉత్పత్తి, బాతులు, కోళ్ల పెంపకాన్ని కూడా ధోనీ బృందం చేపడుతోంది.
అదేవిదంగా వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా ధోని తన ఆదాయాన్ని పెంచుకుంటున్నాడు. ఇకముందు ధోని వ్యవసాయ మార్గంలో తన అడుగుడులను వేయబోతున్నాడు.