Tollywood news in telugu

మూవీ రివ్యూ: తూటా


సినిమా: తూటా
విడుదల తేదీ : జనవరి  01, 2020
నటీనటులు :  ధనుష్, మేఘా ఆకాష్, సునైనా, శశి కుమార్, సెంథిల్ వీర స్వామి.
దర్శకత్వం : గౌతమ్ మీనన్
నిర్మాత‌లు : జి.రామ కృష్ణా రెడ్డి, తాతా రెడ్డి
సంగీతం :  దర్బుక శివ
సినిమాటోగ్రఫర్ : జామూన్ టి జాన్, మనోజ్ పరమహంస, ఎస్ ఆర్ కథిర్
ఎడిటర్:  ప్రవీణ్ ఆంటోని

అసురన్ సినిమా తర్వాత యంగ్ హీరో ధనుష్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఎప్పుడూ తన నటనతో ఆటకట్టుకునే ధనుష్ హీరోగా లెజెండ‌రీ డైరెక్ట‌ర్ గౌత‌మ్‌వాసుదేవ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా ‘ఎన్నై నోకి పాయ‌మ్ తోట‌’. తెలుగులో `తూటా` పేరుతో గొలుగూరి రామ‌కృష్ణా రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో విజ‌య‌భేరి వారి బ్యాన‌ర్‌పై సినిమా గ్రాండ్‌గా నూతన సంవత్సరం సంధర్భంగా ఇవాళ(01 జనవరి 2020) విడుదలైంది. దక్షిణాది పాపులర్ హీరోయిన్ మేఘా ఆకాష్ ఈ సినిమాలో ధనుష్ సరసన నటించింది. ఇవాళ విడుదలైన తూటా ఎలా ఉందో? ఇప్పుడు తెలుసుకుందాం..

కథ:
ఇంజనీరింగ్ చదువుతున్న రఘు(ధనుష్), కాలేజ్ క్యాంపస్ కి షూటింగ్ కొరకు వచ్చిన డెబ్యూ హీరోయిన్ లేఖ( మేఘా ఆకాష్) తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అనాధ అయిన లేఖకు ఇష్టం లేకపోయినా.. తనను పెంచి పెద్ద చేసిన సేతు వీరస్వామి సినిమాలలో నటించమని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆమెతో చెడుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇది నచ్చని లేఖ రఘుతో కలిసి అతని ఇంటికి వెళ్తుంది. లేఖను సేతు వీరస్వామి బ్లాక్ మెయిల్ చేసి రఘు నుండి విడిపోయి మళ్లీ సినిమాల్లో నటించేలా చేస్తాడు. అయితే విడిపోయిన ఇద్దరు మళ్లీ కలుసుకున్నారా? వారి మధ్య ఎంత గ్యాప్ వచ్చింది. చివరికి రఘు, లేఖల ప్రేమ కథ ఎలా ముగిసింది అనేది మిగిలిన కథ…

Read  Vakeel Saab Movie Review: పవర్ ఫుల్ పాత్రతో ప్రభంజనం సృష్టిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ .. !

విశ్లేషణ:
అసుర‌న్‌‌తో సెన్సేష‌న‌ల్ స‌క్సెస్ అందుకున్న రొటీన్ సినిమాలను కాకుండా కొంచెం విభిన్నమైన చిత్రాలను తీస్తూ ఉంటాడు ఈ క్రమంలో వచ్చిన సినిమానే తూటా.. ఈ సినిమాలో కూడా తన అధ్భుతమైన నటనతో మెస్మరైజ్ చేశాడు. మేఘా ఆకాష్ నటన కూడా బాగుంది. ఒకరంటే ఒకరికి చచ్చేంత ఇష్టం ఉన్న యంగ్ లవర్స్ గా నటన సహజంగా ఉంది. వారిద్దరి మధ్య నడిచే రొమాన్స్, కెమిస్ట్రీ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. హై ఇంటెన్స్ తో సాగే సీరియస్ యాక్షన్ థ్రిల్లర్ లో ధనుష్ యాక్టింగ్ ఆకట్టుకొనేలా సాగింది. ధనుష్ తూటా మూవీ మొత్తం అన్నీ తానై నడిపాడు. యాక్షన్ సన్నివేశాలతో పాటు, ఉత్కంఠ రేపే సీన్స్ లో తన సత్తా చూపించాడు. డైరెక్టర్ చెప్పాలని అనుకున్న విషయాన్ని క్లారిటీగా చాలా చక్కగా చూపించాడు. స్క్రీన్‌ప్లే బాగుంది. కొత్తగా అనిపిస్తుంది. పోలీసుల బలం, మాఫీయా సపోర్ట్ ఉన్న విలన్స్ ని ముంబై వెళ్లి ఎదిరించే సన్నేవేశాలు బాగుంటాయి. ఎప్పుడో ఇంటి నుండి పారిపోయిన అన్నయ్య ముంబైలో ఆపదలో ఉన్న హీరోయిన్ ని కాపాడటం వంటివి బాగుంటాయి.

Read  Vakeel Saab Movie Review: పవర్ ఫుల్ పాత్రతో ప్రభంజనం సృష్టిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ .. !

నటీనటులు:
ధనుష్ సినిమా మొత్తాన్ని తన నటనతో భూజాలపై మోశాడు. మేఘా ఆకాష్ ఆకట్టుకుంది. ధనుష్ ఫ్రెండ్ గా చేసిన సునైన తన పాత్ర పరిధి మేరకు మెప్పించింది. ప్రధాన విలన్ రోల్ చేసిన సేతు వీర స్వామి నటన పాత్రకు తగ్గట్టుగా వాస్తవానికి దగ్గరగా ఉంది. నటీనటులు అందరూ వారి పాత్రల బాగా నటించారు.

సాంకేతిక విభాగం:
కథలో భాగంగా నేపథ్యంలో సాగే దర్బుక శివ అందించిన పాటలు బాగున్నాయి. సిద్ శ్రీరామ్ పాడిన పాటలు ఆకట్టుకుంటాయి. నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ప్రవీణ్ ఆంటోని ఎడిటింగ్ పరవాలేదు. యాక్షన్ థ్రిల్లర్స్ కి సుదీర్ఘమైన నిడివి కంటే కూడా క్రిస్పీగా ఉంటే నిడివి ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా కనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే అండ్ ఫిల్మ్ మేకింగ్లో ట్రెండ్ సెట్టర్ దర్శకుడు గౌతమ్ మీనన్ తన స్టైల్‌లో ఆసక్తిగా సినిమాని తెరకెక్కించాడు. సీరియస్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకుడిని మెప్పించేలా సన్నివేశాలు ఉంటాయి.

ఓవరాల్‌గా హాలీవుడ్ సీరియస్ క్రైమ్ అండ్ థ్రిల్లర్స్ చూసేవారు.. కొత్త రకం సినిమాలను మెచ్చేవారిని సినిమా ఆకట్టుకుంటుంది.

Read  Vakeel Saab Movie Review: పవర్ ఫుల్ పాత్రతో ప్రభంజనం సృష్టిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ .. !

రేటింగ్: 3.5/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button