Jagame Thandhiram : ప్రమాదకరమైన గ్యాంగ్ స్టర్ గా ధనుష్ .. గుండె పై ఒక చేయివేసుకొని ’జగమే తంతిరమ్’టీజర్ చుడండి….!

Jagame Thandhiram Teaser : తమిళ్ స్టార్ హీరో ధనుష్ ను కూడా తెలుగు ప్రజలు ఎంతగానో ఆదరిస్తారు. ఇంతకముందు ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ సినిమా తెలుగు వారిని ఆకట్టుకుంది. దీని తరవాత కూడా ఇకడ తెలుగులో ధనుష్ సినిమాలు చాలా వరకు డబ్బింగ్ ఐ వచ్చాయి.

ఇదిలా ఉంటె అతి త్వరలో ధనుష్ నటించిన మరో సినిమా రాబోతుంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం లో ’జగమే తంతిరమ్’ అనే సినిమా వచ్చేస్తుంది. ఇన్ని రోజులు థియేటర్ లో విడుదల చేయాలనుకున్న మేకర్స్ చివరకు ఈ చిత్రాన్ని ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ వేదికగా విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రం హక్కులను డిజిటల్ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ధనుష్ చిత్రం వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ సమక్షంలో నిర్మించారు. ధనుష్ కెరీర్ లో 40వ సినిమా , ధనుష్ సరసన ‘ఐశ్వర్యా లక్ష్మీ’ హీరోయిన్ గా నటించింది. ఈ రోజు చిత్ర యూనిట్ ఈ సినిమా యొక్క టీజర్ ను విడుదల చేశారు. ధనుష్ ‘సురులి’ అనే ప్రమాదకరమైన గ్యాంగ్ స్టర్ గా రానున్నాడు. కానీ ఈసినిమా రిలీజ్ డేట్ మాత్రం యూనిట్ ఇంకా సమాచారం ఇవ్వాల్సిఉంది.