Tollywood news in telugu

పక్క ప్లాన్ తో బుల్లితెర వైపు వస్తున్న దేవిశ్రీ ప్రసాద్…!

Devisree Prasad coming towards television

టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం తెలుగులో ముఖ్య  సంగీత దర్శకులలో ఒకరైన ఎనర్జిటిక్ పర్సన్  దేవిశ్రీ ప్రసాద్ఒ. పెద్ద స్టార్స్ సినిమాలకొరకై ప్రత్యేక బాణీలను సమకూర్చే విషయం లో  బిజీగా ఉంటాడు. ముఖ్యంగా స్టార్ హీరోలు, ప్రముఖ దర్శకులు దేవిశ్రీని కావాలనుకుంటారు. వారికి  తగ్గట్టుగానే ఆయా హీరోల ఇమేజ్ ను ఇంకా పెంచేలా తన  ట్యూన్స్ ని అందిస్తాడు.

ఒక వైపు  సినిమాలతో ఇంతటి బిజీగా ఉంటూనే.. మరోపక్క దేవిశ్రీ తాజాగా ఒక టీవీ షో చేయడానికి అడుగులు వేస్తున్నాడు. ‘జీ తమిళ్’ ఛానెల్ కోసం దేవి శ్రీ  ఒక  టీవీ షోను చేస్తున్నాడు. దాని  పేరు ‘స్టార్ టు రాక్ స్టార్’. ఈ టీవీ షో కు  సంబంధించిన ప్రోమోను ఆ టీవీ  ఛానెల్ విడుదల చేసింది.

మన  దేవిశ్రీ ప్రసాద్మామూలుగా  స్టేజ్ షోలలో తన ఎనర్జీతో ఆ ప్రోగ్రాం కె ఉత్సాహాన్ని తీసుకొస్తాడు. మరి ఇపుడు  త్వరలో ప్రసారం కాబోతున్న ఈ టీవీ షోతో ఎన్ని వన్డర్స్ చేయనున్నాడో చూసి తీరాల్సిందే. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button