Dengue Symptoms and precautions in Telugu | డెంగ్యూ వస్తే కుడా ప్రాణాలు పోతాయా?..

Dengue Symptoms in Telugu: Dengue fever.. రోజు రోజుకి విస్తరిస్తున్న ఈ ప్రాణాంతక మహమ్మారి ని ఎలా అరికట్టాలి? అలాగే మన ప్రాణాలని ఎలా కాపాడుకోవాలి ?
Dengue fever బారిన పడి చాలా మంది ప్రాణాలని కోల్పోయారు. ఇప్పటికి చాలమంది అనారోగ్య పాలవుతున్నారు , అలాగే ఈ మహమ్మారి బారిన పది కుటుంబం మొత్తం కోల్పోయిన ఉదంతాలున్నాయి .
చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా మన తెలంగాణ , ఆంద్ర రాష్ట్రాల్లో డెంగ్యూ పంజా విసురుతోంది, వెంటనే టెస్టుల చేయించి ఈ సమస్యను ముందుగా గుర్తిస్తే మన ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఐతే , ఈ వ్యాధి లక్షణాలు ముందుగా తెలుసుకోవటం చాలా కష్టం. మిగతా జ్వరాలు ఉన్నప్పుడు వాటికున్న కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూ జ్వరం గాని వస్తే.. ఆ లక్షణాలు కనిపించవు. బాడీపెయిన్స్ కుడా ఉండవు. లోలోపలే.. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువై పోతుంది అలాగే ప్లేట్‌లెట్స్ తగ్గిపోతాయి. దీని కారణంగానే చాలా మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు.
వైద్య పరిభాషలో దీన్ని ‘అఫెబ్రిల్ Dengue’ అంటారు. దీని అర్థం.. జ్వరం తాలూకు ఇతర లక్షణాలు లేకుండా డెంగ్యూ రావడం అని అర్థం.
హై ఫీవర్ – dengue symptoms in telugu::ఈ మధ్యకాలంలో హై ఫీవర్ కారణాలతోనే చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. హై ఫీవర్ వచ్చిందని వారికి తెలిసేలోగా ప్రాణాలు మీదకు వచ్చి పడుతుంది . అందువల్ల ఎపుడు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడడం ఎంతో ముఖ్యం. ఏ మాత్రం అనుమానం వచ్చినా డాక్టర్ ని సంప్రదించాలి .
డెంగ్యూ ఎవరికీ ఎక్కువగా వస్తుంది?Dengue ఎక్కువగా అధిక వయసు ఉన్నవారికి, షుగర్ వ్యాధిగ్రస్తులకి, చిన్నపిల్లలకి కుడా ఎ క్కువగా వస్తుంటుంది. ఎందుకంటే వీరిలో ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వ్యాధి వారికే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కావున ఇలాంటివారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో జాగ్రత్త పడాలి.
ఏ సమయంలో డెంగ్యూ ఎక్కువగా వస్తుంది?
ఈ డెంగ్యూ ఆగస్టు నెల , సెప్టెంబర్ నెల , అక్టోబర్ నెల , నవంబర్ నెలల్లోనే ఎక్కువగా వ్యాప్తిస్తుంది . కాబట్టి ఈ నెలల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో చలి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక జ్వరం వస్తే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.
Dengue వ్యాధి లక్షణాలు?
అలసటగా అనిపించటం, ఈ జబ్బు వచ్చిందంటే చాలు త్వరగా అలిసిపోతారు. ఏ పని చేయాలనిపించదు. చిన్నచిన్నవాటికే నీరసపడిపోతుంటారు, డెంగ్యూ వచ్చిందంటే ఆకలి తగ్గిపోతుంది,అసలు ఏం తినాలనిపించదు. రుచి గ్రహించలేరు.
నాలుక మొత్తం చచ్చుబడినట్లు అనిపిస్తుంది, కొంతమందికి వారి శరీరాన్ని బట్టి ఎక్కువ ఉక్కపోత ఉంటుంది. లేదా చలి ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
ఒంటిపై దద్దుర్లు కుడా డెంగ్యూ లక్షణాల్లో ఒకటా ?
ఇది లక్షణం ఉండకపోవచ్చు. కానీ, డెంగ్యూ సోకిందంటే కొందరిలో ఒంటిపై దద్దుర్లు కూడా వస్తుంటాయి . దురద తో ఇబ్బంది పెడతాయి. కాబట్టి గమనిస్తూ ఉండాలి.
బీపీ తగ్గడం కుడా డెంగ్యూ లక్షణాల్లో ఒకటా ?
డెంగ్యూ సోకిన వారికి బీపీలో తగ్గుదల ఉంటుంది. ఇది గమనించుకోవాలి .
బీపీ తగ్గుదల లాంటి లక్షణాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి . అన్ని సందర్భాల్లో ఉండవు . కాబట్టి ముందు నుంచే జాగ్రత్త పడాలి. లేకపోతే ప్లేట్లెట్స్ తగ్గి ప్రాణాపాయం ఉండవచ్చు.
నిజానికి లక్షణాలు అనేవి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. అందరికీ ఒకేలా ఉండవు . అది వారి శరీరతత్వం మరియు రెసిస్టన్స్ పవర్ పైన ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి . .
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఏ జ్వరం ఐన ఎక్కువగా దోమల వల్ల వస్తుంటుంది. కాబట్టి వాటిని లేకుండా చూసుకోవాలి .
ఇంటి చుట్టుపక్కల చెత్త లేకుండా చూసుకోవాలి
ఆహారం విషయంలో జాగర్తపడాలి
- బయటి ఆహారం తీసుకోవద్దు . ఆయిలీ ఫుడ్‌కి చాలా దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి.
- వండిన ఆహార పదార్థాలపై ఎపుడు మూతలు ఉంచాలి .
- వీలైనంత వరకూ వండుకున్న ఆహారాన్నే సేవించాలి .
- సలాడ్స్ ఎక్కువగా తీసుకుంటే మంచిది .
- సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచిది.
- నీటిని కాచి చల్లార్చి తాగాలి, నీటి ద్వాారే ఎక్కువ రోగాలు వస్తుంటాయి. కాబట్టి పరిశుద్ధమైన నీటినే తాగాలి.
- సమస్య వచ్చాక బాధపడే బదులు ముందుగా ఆ విషయంలో జాగ్రత్త ఉండటం చాలా మంచిది.