అమ్మాయి ఆర్డర్ … 40 మంది డెలివరీ బాయ్స్ … ఆశ్చర్యానికి గురిఅయిన చుట్టుపక్కలవాళ్ళు !

ఒప్పుడు ఆకలివేస్తే అమ్మ గుర్తుకువచ్చేది, అదే ఇపుడు డెలివెరి బాయ్ గుర్తుకు వస్తున్నాడు. ఒక్క క్లిక్ తో మనం కోరుకున్న ఫుడ్ మన ఇంటి ముందుకు తీసుకువస్తూ ఉంటారు.
కానీ ఒక్క క్లిక్ తో ఏకంగా 40 మందికి పైగా డెలివెరి బాయ్స్ వచ్చారు. ఈ సంఘటన ఫిలిప్సిన్స్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే…. ఫిలిప్సిన్ లోని సెబూ సిటీలో స్కూల్ లో చదువుతున్న ఒక అమ్మాయి ఫుడ్ యాప్ సహాయంతో లంచ్ ని ఆర్డర్ చేసింది. ఆర్డర్ చేసిన కాసేపటికే ఏకంగా 40 మందికి పైగా డెలివరీ బాయ్స్ దిగారు. నేనుతెచ్చిన ఫుడ్ తీసుకోండి అంటే నేనుతెచ్చిన ఫుడ్ తీసుకోండి అంటూ పోటీ పడ్డారు. ఇది చుసిన చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఎందుకంటే ఫుడ్ వెస్ట్ అవుతుందని వారి బాధ.
ఇంతకీ ఇది ఎలా జరిగిందని ఆలోచిస్తే అది యాప్ మిస్టేక్ అని తెలిసింది. ఆ అమ్మాయి చేసిన ఆర్డర్ ని ఆ కంపెనీ వాళ్ళు ఒక బాయ్ కి పంపితే అదికాస్తా 40 మందికి వెళ్ళిపోయింది.