Viral: స్టూడెంట్ రాసిన ప్రేమలేఖకు .. అమ్మాయి అదిరిపోయే రెస్పాన్స్….!

Delhi Boy Proposes : ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఏదోఒక విషయం వైరల్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడో జరిగిన విషయాలు కూడా ఇపుడు క్లిక్ ఐ వైరల్ గా మారుతూ ఉంటాయి. అందులో కొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తే… మరికొన్ని నవ్వును పుట్టిస్తాయి. అలాంటిదే ఇపుడు ఒకటి జరిగింది. అదేంటంటే ఇంటర్ చదివే ఒక అబ్బాయి తన ప్రేమను వ్యక్తపరచడానికి ఒక ప్రేమలేఖను రాశాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. మరి ఆ ప్రేమలేఖకు అమ్మాయి ఇచ్చిన సమాధానం చుస్తే ఆశ్చర్యానికి గురికాక తప్పదు.
ఈ మధ్యన ఎక్కువగా ప్రేమ, పెళ్లి, పిల్లలు వారి భవిష్యత్తు వీటిపైనే ఎక్కువగా చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇక ప్రేమించేవారి విషయానికి వస్తే… వారు వివిధ రకాలుగా ప్రేమను వ్యక్త పరుస్తూ ఉంటారు. అందులో ఒక అబ్బాయి ఈ విదంగా తన ప్రేమను ఒక అమ్మాయి కి తెలియజేసాడు.
‘నేను ఢిల్లీకి చెందినవాడిని… ఇప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా.. మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు నా గర్ల్ ఫ్రెండ్ అవుతావా…. అంటూ… ‘మా నాన్న ఇక్కడ చాలా పెద్ద షిప్పింగ్ వ్యాపారం ఉంది. నేను నీ కోసం ఏదైనా చేస్తాను. దయచేసి, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గా ఉంటావా… అంటూ ఆ ఢిల్లీ అబ్బాయి లేఖను రాశాడు .
ఆ అబ్బాయి రాసిన లేఖకు అబ్బాయి ఇలా అంటుంది. ‘దయచేసి స్కూల్స్ తెరవండి’ అని అమ్మాయి ఆ లేఖకు తిరిగి రిప్లై ఇచ్చింది. అదేవిదంగా ‘నీ లేఖను పెద్దగా పట్టించుకోవడం లేదు, నీ మెస్సెజ్ చదివితే నవ్వొస్తుంది అంటూ బదులిచ్చింది.