Deepika says ‘I .. my alter ego’ : ‘నేను.. నా ఆల్టర్ ఈగోస్’ అంటున్న దీపికా…. డిఫరెంట్ యాంగిల్ డ్యాన్స్ తో పిచ్చెక్కిస్తుంది..వీడియో వైరల్ …!

Deepika says ‘I .. my alter ego’ : బాలీవుడ్ మెరుపుతీగ దీపికా పదుకొనే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిన విషయమే, షోషల్ మీడియాలోని తన పేజ్ లో సినిమాలకు సంబంధించిన అప్డేట్స్తోపాటు.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అదేవిదంగా సమాజంలో జరిగే విషయాలపై తన అభిప్రాయాలను కూడా వ్యక్తపరుస్తుంది.
ఇదంతా అలాఉంటే.. తాజాగా ఈ భామ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీపికా షేర్ చేసిన వీడియోలో రకరకాల యాంగిల్ లో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ‘నేను.. నా ఆల్టర్ ఈగోస్’ అంటూ తన వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చుకుంది. ఇక దీపికా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం దీపికా భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ…. చాల బిజీగా గడుపుతుంది.
తన భర్త రణ్వీర్ సింగ్‌తో కలిసి కపిల్ దేవ్ బయోపిక్ ‘83’, హృతిక్ రోషన్‌తో ‘ఫైటర్’ , షారుఖ్ ఖాన్‌తో ‘పఠాన్’, మూవీలలో నటిస్తోంది. వీటితో పాటు భారీ ఎత్తున తెరకెక్కబోతున్న ‘మహాభారతం’లో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తున్నట్టు సినీవర్గాలు మాట్లాడుకుంటున్నాయి.