Tollywood news in telugu

ముంబై లోని ఒక రెస్టారెంట్ లో ….. వారి నుండి తప్పించుకుని పరుగులు తీసిన దీపికా పదుకుణే… అసలేంజరిగింది.. !

deepika padukone

బాలీవుడ్ స్టార్లకు క్రేజ్ ఏ విదంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సినీ  స్టార్ లను  చూసేందుకు అభిమానులు తెగ ఆరాటపడుతూ ఉంటారు.  ఇక దీపికా పదుకుణే వంటి అందగత్తెలకు ఎంతటి ఫాలోయింగ్ ఉంటుందో మీరే ఆలోచించండి. జనాలమధ్యకు వచ్చినప్పుడు సంతోష పడినప్పటికీ అపుడపుడు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి.

 తాజాగా ఇలాంటిదే జరిగింది దీపికా కు , అదేంటంటే  ముంబైలో నిన్న రాత్రి ఆమె ఓ రెస్టారెంటుకు వెళ్లింది. ఆ తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఆమెను అభిమానులు తాకిడి ఎక్కువైంది. ఈ సందర్భంలో రెస్టారెంట్ బయట టిష్యూలు అమ్ముతున్న మహిళలు ఆమె స్లింగ్ బ్యాగ్ ను లాక్కునేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో ఆమె ఒక అడుగు వెనక్కి వేసింది. ఆ తర్వాత తన బాడీగార్డుల సాయంతో అక్కడి నుండి పరుగులు తీసి కారులోకి వెళ్ళిపోయింది. ఇలా పాపం సెలెబ్రిటీ లు ఒంటరిగా బయటికి రావడానికి కూడా భయపడుతూ ఉంటారు.

ఇక ప్రస్తుతం దీపిక తన భర్త రణవీర్ సింగ్ కు జోడీగా ’83’వ  సినిమాలో నటిస్తుంది. అదేవిదంగా ‘ శకున్ బాత్రా’ మూవీ లో  కూడా నటిస్తోంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button