Viral news in telugu

యువతలో తగ్గిపోతున్న పురుషాంగం సైజు.. పరిశోధకుల హెచ్చరిక … ఈ పనులవల్లే అలా జరుగుతుందట…!

Decreasing penis size in youth

పురుషులలో పురుషాంగం విషయానికి వస్తే… కొందరు సైజ్ తో పనిలేదు అని అంటారు. మరి కొందరు  మాత్రం తగిన సైజు ఉండాల్సిందేనని అంటున్నారు. ఇలా ఎప్పుడు  షోషల్ మీడియాలో దీనికి సంబందించిన చర్చలు జరుగుతూనే ఉంటున్నాయి.  అయితే, పెద్దదా?.. చిన్నదా? అనే విషయాలను పక్కన పెడితే.. భవిష్యత్తులో అస్సలు పురుషులకు అంగమనేది మసకబారిపోతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి.  ఎందుకంటే.. కాలం గడిచేకొద్ది పురుషుల అంగం సైజు కూడా క్రమక్రమంగా  తగ్గిపోతుందంట. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే.. మీరు ఈ తాజా పరిశోధన గురించి కచ్చితంగా తెలుసుకోవల్సిందే.

డాక్టర్ ‘షన్నా స్వాన్’ ఇతను ఒక పర్యావరణ శాస్త్రవేత్త, ఇతను  రచించిన ‘కౌంట్ డౌన్’ అనే పుస్తకంలో భవిష్యత్తులో పురుషులు ఎదుర్కొనే సమస్యల గురించి స్పష్టంగా తెలిపారు.  సంతానం విషయంలో మానవులు  సంక్షోభం ఎదురుకాబోతుందని వెల్లడించాడు.  పురుషాంగం పరిమాణం క్రమక్రమంగా  తగ్గుముఖం పట్టడం, వీర్య కణాల ఉత్పత్తిలో కూడా తగ్గుదల ఉంటుందని  పేర్కొన్నారు. ఇందుకు నేటి మానవుల జీవనశైలే కారణమని  ఆయన స్పష్టం చేశారు.

దీనికి గల ఒక కారణం కాలుష్యమే నట, దీనివల్ల  పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుముఖం పట్టడం.  అంగ యొక్క సైజ్ తగ్గడం, దీని వల్ల  మానవ జాతి అంతరించి పోయే అవకాశం లేకపోలేదు అని తెలిపాడు. అలాగే ప్లాస్టిక్ వస్తువుల తయారీలో ఉపయోగించే ‘థాలేట్ ‘ అనే రసాయనం హార్మోన్లను ఉత్పత్తి చేసే ఎండోక్రైన్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుందని తన పుస్తకం లో తెలిపాడు. ఇంకా కాలుష్యం వల్ల చిన్న అంగాలతో పుట్టే పిల్లల సంఖ్య ఎక్కువవుతుందని వెల్లడించాడు.

అసలు విషయానికి వస్తే… ఇతను చేసిన పరిశోధన ఇలా జరిగిందంటే… ఎలుకలపై పలు పరిశోధనలు జరిపారు. పిండాలు థాలెట్ రసాయనిక చర్యకు గురైనప్పుడు పుట్టే బిడ్డ జననేంద్రియాలు సైజ్ తగ్గినట్టు  కనుగొన్నారు. ఇంకా చెప్పాలంటే.. మగ బిడ్డలు కడుపులో పెరుగుతున్నప్పుడే ఈ సమస్య వాటిల్లుతుందని, ప్లాసిక్‌ను మృదువు గా మార్చేటందుకు ‘ థాలేట్’ ఉపయోగిస్తారని, ఇది పిల్లలు ఆడుకొనే బొమ్మలు, వస్తువుల ద్వారా కూడా శరీరంలోకి ప్రవేశిస్తున్నట్టు తెలిపాడు. దీనివల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నట్టు వెల్లడించాడు. కాబట్టి, ప్లాస్టిక్ వస్తువులకు, వాయు కాలుష్యానికి ఎంత దూరం ఉంటె అంత మంచిదని అతని వాదన. ఇకనుండైనా ప్లాస్టిక్ వస్తువులకు దూరం ఉండటం ఉత్తమం.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button