telugu cinema reviews in telugu language

Dear megha movie Review In Telugu | డియర్ మేఘ (2021)

Dear megha movie Review And Rating
Dear megha Telugu movie Review

Movie Review : Dear megha , నటీనటులు : మేఘ ఆకాష్ , అరుణ్, పవిత్ర, అర్జున్ సోమయజుల, నిర్మాతలు :-  అర్జున్ దాస్యన్, సంగీత దర్శకుడు :- గౌర హరి, డైరెక్టర్ :- ఏ . సుశాంత్ రెడ్డి , Release Date : 3rd September 2020

లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో విదుదలైన చిత్రాలలో మేఘ ఆకాష్ నటించిన డియర్ మేఘ ఒకటి. ఎన్నో నెలల తర్వాత ప్రేక్షకుల మనసుని ఓటీటీ నుంచి థియేటర్ కి లాగే ప్రయత్నం చేస్తున్నారు సినీ వర్గాలు. ఈ తరహాలోనే డియర్ మేఘ వచ్చింది. ఇప్పుడీ సినిమా ఎలా ఉందొ చూద్దాం.

Dear megha Story :

ఈ కథ మేఘ ( మేఘ ఆకాష్ ) యొక్క కాలేజీ లైఫ్ ని చూపిస్తూ మొదలవుతుంది. మేఘ కాలేజీ సమయం లో అర్జున్(అర్జున్ సోమయాజులు ) ని ప్రేమిస్తుంది. కానీ కాలేజీ సమయం లో ఇద్దరు మాట్లాడుకోరు ఆలా కాలేజీ లైఫ్ ముగిసిన 3 ఏళ్ళకి మల్లి ఒక అపార్ట్మెంట్ లో కలుసుకుంటారు. ఈ సారి ఇద్దరు ప్రేమించుకుంటారు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటారు. కానీ కొన్ని అనుకోని సంఘటనలు వాళ్ళ ఇద్దరు విడిపోయారు. తర్వాత మేఘ తన లైఫ్ లో బాధను మరిచిపోవడానికి వేరే ప్రదేశానికి వెళ్ళగా అక్కడ అది(ఆదిత్ అరుణ్ ) తో స్నేహం చేస్తుంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిపోతుంది. ఆలా వీరిద్దరూ హ్యాపీగా ఉన్న సమయంలో అర్జున్ తిరిగి మేఘ లైఫ్ లోకి వస్తాడు. ఇపుడు మేఘ ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? అర్జున్ , మేఘ ఎందుకు గతంలో విడిపోయారు ? ఆది పరిస్థితి ఏంటి ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.

👍 :-

  • అర్జున్ మరియు మేఘా లవ్ స్టొరీ తో పోల్చుకుంటే మేఘా ఆకాష్ మరియు ఆదిత్ అరుణ్ లా మధ్య లవ్ స్టోరీ సన్నివేశాలు చాలా బాగున్నాయి.
  • కథ మరియు కథనం
  • సెకండ్ హాఫ్ మరియు క్లైమాక్స్.
  • మ్యూజిక్ చాలా బాగుంది.
  • దర్శకత్వం.
  • సినిమాటోగ్రఫీ కొత్తగా ఉంది.
  • నిర్మాణ విలువలు బాగున్నాయి.

👎 :-

  • ఫస్ట్ హాఫ్ మరియు కాలేజ్ ఎపిసోడ్స్.
  • ఎడిటింగ్ బాగా చేయాల్సింది.

Dear megha Final Verdict

మొత్తానికి డియర్ మేఘా అనే సినిమా కథ పరంగా మరియు కథనం పరంగా చాలా బాగా తెరకెక్కించారు దర్శకుడు సుశాంత్ రెడ్డి. మేఘా ఆకాష్ , ఆదిత్ అరుణ్ ల మధ్య సాగే సన్నివేశాలు సినిమాకే హైలెట్. అర్జున్ లవ్ స్టోరీ తో పోల్చుకుంటే అదిత్ దే బాగుంటుంది. ఎమోషనల్ సన్నివేశాలు మరియు క్లైమాక్స్ సినిమాని మరో స్థాయికి తీసుకొని వెళ్ళాయి. సినిమాటోగ్రఫీ కొత్తగా ఉంది. మ్యూజిక్ చాలా బాగుంది. మొదటి భాగం లో అనవసరపు సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయి. విసుగు తెపిస్తుంది. ఎడిటింగ్ ఇంకొంచెం బాగా చేయాల్సింది. మొత్తానికి ఈ వారం కుటుంబం అంత కలిసి డియర్ మేఘా సినిమాని హ్యాపీ గా థియేటర్ లో చూసేయచు.

Note : Dear megha movie Review is completely Based On Reviewer Opinion not cinema lovers, Please watch movie if you want to watch. Rating :- 2.75 /5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button