News

ఈ మాయలేడి వలపువలలో చిక్కారో….అంతే సంగతులు !

dangerous lady in jagtial district

జగిత్యాల: తెలంగాణలోని జగిత్యాలలో ఒక మాయలేడి సంచరిస్తుంది. ఈ మాయలేడి చేసే పని ఏంటంటే , డబ్బులు , మేడలో ఉండే గొలుసులు, చేతికి ఉండే బ్రాస్లెట్ లు ఉన్నవారిని ఎంచుకొని, వారికీ వలపువలను విసిరి తన వలలో చిక్కుకొనేలా చేసుకొని పనికానిచేస్తుంది.

ఈ దుండగులు వేసే  ప్లాన్స్ గురించి  జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ ఇలా వివరించారు… ఈ ముఠా లో ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నారు. వీరు బాగా డబ్బున్నవారిని టార్గెట్ చేసి వారికీ మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుంటారు. ఈ యువతులు వీరి వలలో చిక్కుకున్న వారిని ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి , వారిముఠాలోని యువకుల చేత వారిని బెదిరించి , వారి దగ్గర ఉన్న డబ్బు, బంగారాన్ని లాగేసుకొని , ఈ విషయం ఎక్కడైనా చెబితే నీ పరువు తీస్తాం అని బెదిరించి వదిలిపెడతాడు.

ఇలా వీరి దందాను కొనసాగిస్తూ చివరికి పోలీసులకు చిక్కారు. వీరి వద్ద 150 గ్రా వరకు బంగారం ఉదని పోలీసులు తేల్చారు.

Read  corona vaccine price in india: బయటి మార్కెట్ లో కరోనా వ్యాక్సిన్.. రేటు ఎంతయి ఉంటుంది..పేదవారికి అందుతుందా... ? పూర్తీ వివరాలు మీకోసం...
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button