Curd: పెరుగు తినట్లేదా? అయితే మీరు ఇవన్నీ కోల్పోతున్నట్లే!
భారతదేశ ఆయుర్వేద శాస్త్రంలో పెరుగుకు విశేష గుర్తింపు ఉంది. పెరుగు చేసే మంచి వల్ల దీనికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉంది. మన ఆహారపు అలవాట్లలో దీనిని భాగం చేసుకోవడం వల్ల కలిగే లాభాలను తెలుసుకుందాం..
పెరుగు శరీరానికి అవసరమైన అనేక పోషకాలను కలిగి ఉంటుంది. పెరుగులో అధికంగా ఉండే క్యాల్షియం ఎముకలు, దంతాలు ధృడంగా ఉండటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
రోజూ ఒక కప్పు పెరుగు తీసుకోవడం వలన క్యాల్షియం 49 శాతం భాస్పరం 38శాతం, మెగ్నీషియం 12 శాతం, పొటాషియం 18 శాతం మన శరీరానికి అందుతుంది.

పెరుగులో బి6, బి12 విటమిన్‌లు అధికంగా ఉంటాయి. ఈ రెండు గుండె జబ్బులనుంచి రక్షిస్తాయి.
పెరుగులో ప్రోబయాటిక్స్ అనగా లైవ్ బాక్టీరియా మరియు ఈస్ట్‌ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
రోజూ పెరుగును తినడం రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు. అనారోగ్యం బారిన పడే అవకాశం తగ్గుతుంది.