Today Telugu News Updates
వేదించినందుకు చితకబాది … మలం తినిపించారు !

ఒక బాలికను కొన్ని రోజులుగా వేధిస్తున్న వ్యక్తి కి మలం తినిపించిన సంఘటన రాజస్థాన్ లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే… రాజస్థాన్ రాష్ట్రం లోని ధోల్ పూర్ కి చెందిన దీపక్ అనే వ్యక్తి కొన్ని రోజులక్రితం అదే ప్రాంతానికి చెందిన ఒక బాలికను లైంగిక వేదింపులకు పాల్పడుతున్నాడు.
కొద్దీ రోజులక్రితం ఎంత చెప్పిన మారకపోవడంతో పోలీస్ లకు ఫిర్యాదు కూడా చేసారు. అయినా తన బుద్ది మారలేదు. మరో సారి దీపక్ వేధింపులు ఎక్కువకావడంతో ఈ విషయాన్నీ బాలిక తల్లిదండ్రులు చుట్టుపక్కల స్థానికులకు తెలిపారు.
మరోసారి దీపక్ ఆ బాలికను వేదించగా స్థానికులు అందరు కలిసి ఆ వ్యక్తి ని చితకబాది అక్కడున్న మలాన్ని తినిపించారు. ఈ విషయం తెలుసుకున్న దీపక్ తల్లిదండ్రలు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇంతకుముందే దీపక్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు కావడంతో పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.