Crime News: నువ్వు నల్లగా ఉన్నావ్..మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని భర్త అనడంతో ఆ భార్య ఏంచేసిందో చుడండి…!

ఒక భర్త చేసిన ఘనకార్యం చుడండి. ఎలావుందో.. తన భార్యని నల్లగా ఉన్నావ్ నీ మొహంలో అందంకూడా లేదు. ఇక నీతో బయటికివెల్దామంటే ఏదోలా ఉంది. అంటూ భార్యను రోజు తన ఇబ్బందికరమైన మాటలతో నరకం చూపిస్తున్నాడు. తనకి విడాకులు ఇచ్చి వేరే అమ్మాయిని పెళ్ళిచేసుకుంటనని రోజు పోరుపెడుతుండటంతో , ఆ వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది.
ఈ దారుణ సంఘటన నిర్మల్ జిల్లా తానూర్ మండలంలో చోటుచేసుకుంది. హంగీర్గ గ్రామానికి చెందిన హత్తేరావు జైభీమ్కు , అదేవిదంగా మహారాష్ట్రలోని బేంద్రి గ్రామానికి చెందిన దీక్ష(25) కు 7 సంవత్సరాలక్రితం పెళ్లి జరిగింది.
ఈ 7 సంవత్సరాలు వీరి జీవితం బాగానే సాగినప్పటికీ , ఈ మధ్యనే జైభీమ్కి తన వైఫ్ నచ్చడంలేదు , తనని నల్లగా ఉందని, నీతో బయటికి వెళ్లలేకపోతున్నానని వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలోనే జైభీమ్ రెండో పెళ్లి చేసుకుంటానని దీక్షను నిత్యం వేధిస్తున్నాడు.
దీంతో ఆమె తీవ్ర మనోవేధనకు గురైంది. ఈ సందర్భంలోనే, ఈ నెల 12వ తేదీన భార్యభర్తలిద్దరూ కలిసి వ్యవసాయం పనుల కోసం పొలానికి చేరుకున్నారు. కాసేపు పొలం పనులు చేసాక జైభీమ్ మంచినీళ్లు తేవడానికి వెళ్లే సమయంచూసి దీక్ష క్రిమిసంహారక మందు తాగి ప్రాణాలొదిలింది.
విషయం తెలుసుకున్న దీక్ష తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి తన కూతురు ఎందుకు పురుగులమందు తాగిందో అనే అనుమానంపై దీక్ష భర్త ఫై వారి కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసారు.