Viral news in telugu

తన భార్య ఫోటో, మొబైల్ నంబర్ ఉన్న పోస్టర్లను ఊరంతా అతికించి బజారుకీడ్చాడు ఒక ప్రబుద్దుడు… ఇందుకోసమేనట…!

crime news telugu

crime news telugu : మనుషుల కంటే జంతువులు నయం అంటుంటారు కొందరు. ఈ మాట ఒక్కోసారి నిజమనే అనిపిస్తుంది. ప్రస్తుతం మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారి పోతున్నాయి. మానవ విలువలను మరచి ప్రవర్తిస్తున్నారు.  అనుమానం పెను భూతం లా తయారైంది.

ఇలాంటి ఘటనే  తాజా ఒకటి జరిగింది. తన  భార్య విడాకులు ఇవ్వకపోవడంతో , తన మీద కోపంతో  ఆమె పోస్టర్లను ఊరంతా అంటించాడు . “అవసరమైతే ఈ నంబర్ కి ఫోన్ చేయండి ”  అంటూ తన భార్య  ఫోన్ నంబర్ ను రాసాడు.  ఈ విచిత్రమైన ఘటన  మహారాష్ట్రలోని చిఖాలి తాలూకా బుల్దానాలో చోటుచేసుకుంది.

 వివరాల్లోకి వెళ్తే…

సమాధన్  అనే వ్యక్తి 2020 లో  ‘అంచార్వాడి’కి చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతడు తన  భార్యను నిత్యం అనుమానించేవాడు. అంతేకాకుండా మానసిక, శారీరక వేధింపులకు పాల్పడేవాడు. తన భార్య  దీపావళి కి  పుట్టింటికి వెళ్లిన .. తిరిగి రాకపోవడంతో … విడాకులు కావాలని డిమాండ్ చేసాడు. అందుకు ఆమె ఒప్పుకోక పోవడంతో  ఆగ్రహించిన సమాధన్ భార్య ఫోటోతో పోస్టర్ తయారు చేయించి అందులో ఆమె ఫోన్ నంబర్ కూడా చేర్చి. ఆ పోస్టర్ ని ఊరంతా అంటించాడు.  

ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళా బంధువు  సమాధన్‌ను ప్రశ్నించాడు. ఆమె విడాకులు ఇచ్చే వరకు ఇలాగె చేస్తానని , అంతేకాకుండా ముందు ముందు  భార్య సోదరి, తల్లి ఫోటోలు కూడా వేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.  ఇక ఎంత చెప్పిన మారడు అని గ్రహించిన ఆ బంధువు ‘అంధేరా’ పోలీసులకు  చెప్పి కేసు వేశాడు. 

భార్యను ఇలా నవ్వులపాలు చేయడంపై ఆ వీధి ప్రజలు కూడా  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేసిన వాడికి   కఠిన శిక్ష పడేలా చేయాలనీ , మున్ముందు ఇంకెవరు ఇలా చేయకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు  డిమాండ్ చేసారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button