Today Telugu News Updates

రాష్ట్రంలో కరోనా విజృంభణ, COVID19 cases in Telangana

తెలంగాణలో కరోనా వైరస్ విలయతాడవం చేస్తుంది.COVID19 cases in Telangana 1018 ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే భారీగా రికార్డు స్థాయిలో 881 కొత్త సు కేస్లు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది . ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది .

 తెలంగాణలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి . మంగళవారం ఒక్కరోజులోనే పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి . మొత్తం 1018 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు . దీంతో రాష్ట్రంలో మొత్తం కరోవా కేసుల సంఖ్య 17,357 కు చేరుకుంది . ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 8785 గా ఉన్నాయి . గత 24 గంటల్లో 1,712 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు . ఇప్పటి వరకు పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 7,294 కు చేరింది . ఇక మంగళవారం మరో ఏడుగురు వ్యక్తులు కరోనాకు బలి కాగా , మొత్తం సంఖ్య 267 కి చేరింది . 

COVID19 cases in Telangana :

 మంగళవారం రోజు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులను గుర్తించారు . ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే భారీగా రికార్డు స్థాయిలో 881 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది . ఆ తర్వాత కేసులు  ఆధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది . అక్కడ 33 కేసులు నమోదు కాగా ,  సంగారెడ్డి జిల్లాలో 3 కొత్త కరోనా కేసులను గుర్తించారు .  మేడ్చల్ జిల్లా లో 36 కేసులు నమోదయ్యాయి . ఇక నిజామాబాద్  జిల్లాలో 3, ఆదిలాబాద్ జిల్లాలో 2, మహబూబ్ నగర్ జిల్లాలో 10 , కరీంనగర్ జిల్లాల్లో 2 , సిద్దిపేట 3 , సూర్యాపేట 2 , ఖమ్మం 7  , నిజామాబాద్ జిల్లాల్లో 3  గుర్తించారు .

 మరోవైపు  తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే 3,457 కరోనా టెస్టులు చేశారు . వీటిలో మంచే 1018 కేసులు బయటపడ్డాయి . దీంతో మొత్తం ఇప్పటి వరకూ కరోనా టెస్టుల సంఖ్య 88,563 కు చేరింది . మంగళవారం 2,512 ఫలితాలు నెగిటీగా తేలాయి . కరోనా టెస్టులు చేసే కేంద్రాలివీ .. గాంధీ మెడికల్ కాలేజీ , ఉస్మానియా జనరల్ పోస్పిటల్ , నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి , పంజాగుట్ట నీమ్స్ , ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ( ఐపీఎం ) , కాకతీయ మెడికల్ కాలేజీ ( వరంగల్ ) హైదరాబాద్ సీసీఎంబీ , సెంటర్ ఫర్ డీఎస్పీ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ , ఈఎస్సై , రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( రిమ్స్ , ఆదిలాబాద్ లో కరోన టెస్టులు చేస్తున్నట్లు వివరించారు .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button