Tollywood news in telugu
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కి కోర్టు సమన్లు

రెండు సంవత్సరాల క్రితం తమిళనాడులోని తూత్తుకుడి అనే ప్రాంతంలో జరిగిన ఘటనపై సూపర్‌స్టార్ రజనీ కాంత్‌కు కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది.
రజని చేసిన ‘అసాంఘిక శక్తుల’ వ్యాఖ్యలపై వివరణ కోరుతూ ఆ కేసును దర్యాప్తు చేస్తున్న మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ జగదీశన్ , రజనీకాంత్ కి కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చే సంవత్సరం జనవరి 19న కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది .