health tips in telugu

గొంతు ఇన్‌ఫెక్షన్‌ తగ్గాలంటే ఇలా ట్రై చేయండి..

సాధారణంగా గొంతునొప్పి అనేది వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల వస్తుంది. గొంతునొప్పితో ఉన్నప్పుడు ఏదైనా ఆహారం గానీ, ద్రవపదార్థాలు తీసుకున్నప్పుడు ఈ నొప్పి ఇంకా అధికమవుతూ ఉంటుంది. అయితే మనకు అందుబాటులో ఉన్న పదార్థాలను వాడి ఈ గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

వేడినీటిలో కొద్దిగా ఉప్పను కలిపి పుక్కిలించడం ద్వారా గొంతునొప్పి సమస్యను తగ్గించుకోవచ్చు. ఉప్పు ఈ నొప్పికి కారణమైన ఇన్‌ఫెక్షన్‌లను తగ్గించడంలో సహాయపడుతుంది.

గొంతునొప్పిని తగ్గించడంలో అల్లం చాలా బాగా పనిచేస్తుంది. వేడినీటిలో కొంచెం అల్లం వేసి బాగా మరగనిచ్చి వడకట్టి ఆ నీటిని తాగడం వల్ల గొంతునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

పసుపు ఇన్‌ఫెక్షన్‌లను తగ్గించడంలో మొదటిస్థానంలో ఉంటుంది. మరుగుతున్న నీటిలో ఒక చెంచా పసుపు వేసి బాగా మరగనిచ్చి దానిని వడకట్టి, గోరువెచ్చగా అయ్యాక రెండు టేబుల్‌ స్ఫూన్ల నిమ్మరసం కలిపి ఆ పానీయాన్ని మూడు పూట్ల తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

జీలకర్ర, వెల్లుల్లిని నీటిలో వేసి బాగా మరగనిచ్చి, తర్వాత ఈ పానీయాన్ని గోరు వెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

గోరు వెచ్చని నీటిని తీసుకోవడం, తులసి ఆకులను నమలడం, లవంగాలను చప్పరించడం వంటివి చేయడంవల్ల కూడా గొంతునొప్పిని తగ్గించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button