Corporator Movie Review and Rating | హిట్టా ఫట్టా :-

Movie :- Corporator (2021) Review
నటీనటులు :- శకలక శంకర్ , సునీత పాండే మొదలగు.
నిర్మాతలు :- పద్మనాభ రెడ్డి మరియు S.V. మాధురి
సంగీత దర్శకుడు :- MLP రాజ
డైరెక్టర్ :- సంజయ్ పోనూరి
ముఖ్యగమనిక :- ఈ వెబ్ సైట్ లో రాసిన లేదా రాయబోయే ప్రతి ఆర్టికల్ / రివ్యూస్ మా సొంత అభిప్రాయం తో రాసినది. డబ్బులకి రేటింగ్స్ ఇచ్చే సైట్ కాదని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా మా వెబ్ సైట్ రివ్యూస్ లింక్స్ ఫార్వర్డ్ చేసి మీకు పంపి డబ్బులు తీసుకున్నచో మాకు సంబంధం లేదు. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్బడుతే తగిన చట్టరీత్య చర్యలు తీసుకొన బడును. ఏమైనా సందేహాలు ఉంటె teluguvision1@gmail.com కి మెయిల్ చేయండి …… be aware of frauds and fake people.
Story (Spoiler Free) :-
ఈ కథ విజయవాడ లోని 48 వ వార్డ్ కార్పొరేటర్ అయినా ప్రసాద్ ని చంపే సన్నివేశం తో మొదలవుతుంది. కట్ చేస్తే కొన్ని కామెడీ సన్నివేశాలతో బ్రిటిల్ స్టార్ శంకర్ ఎంట్రీ ఉంటుంది. మందిర కి శంకర్ అంటే ఇష్టం. ఆలా కొన్ని సన్నివేశాలు సాగగా ప్రసాద్ చనిపోయినందుకు బై ఎలెక్షన్స్ వస్తాయి. బై ఎలెక్షన్స్ లో మేయర్ తమ్ముడు పోటీచేయగా , మేయర్ పార్టీ లోని అభ్యర్ధురాలు తనని నిలబెట్టలేదని తన చెల్లెలైన మందిర ని పోటీలో నిలబెటిస్తుంది.
ట్విస్ట్ ఏంటంటే మందు బాటిల్ ఇయ్యలేదని శంకర్ కూడా నామినేషన్ వేసి అభ్యర్థిగా నిలుస్తాడు. ఇప్పుడు కార్పొరేటర్ గా ఈ ముగ్గురు పార్టీ సభ్యులు ప్రచారాలు చేయగా శంకర్ గెలుస్తాడు. కాకపోతే కొని అనుకోని సంఘటనల చెత్త స్పెషల్ పోలీస్ టీం వచ్చి శంకర్ ని అరెస్ట్ చేసి తీసుకొని పోతారు.
ఇంతకీ కార్పొరేటర్ గా శంకర్ ఎలా గెలిచాడు ? నిజంగానే శంకర్ మందు బాటిల్ ఇయ్యలేదని కార్పొరేటర్ గా పోటీ చేశాడా లేదా ఇంకా ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా ? కార్పొరేటర్ గా గెలిచాక ఎందుకు స్పెషల్ పోలీస్ ఆఫీసర్ వచ్చి శంకర్ ని అరెస్ట్ చేస్తారు ? చివరికి శంకర్ ఎం చేశాడు ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.
Positives 👍:-
- శంకర్ హీరో గా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కార్పొరేటర్ గా మరియు కామెడీ చేస్తూనే ప్రేక్షకులని చాలా బాగా అలరిస్తారు. గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో శంకర్ నటన చాల బాగుంటుంది. మిగితా పాత్రధారులు కూడా వారి వారి పాత్రకి తగ్గట్టు బాగా చేశారు.
- కథ మరియు కధనం చాల బాగుంది.
- మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టే బాగా కొట్టారు.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
- సినిమాటోగ్రఫీ కొత్తగా ఉంది.
- దర్శకుడు సినిమా మొదటినుంచి తాను చూపెట్టాలనుకుంది చూపిస్తూనే వెళ్ళారు ఎటువంటి అనవసరపు సన్నివేశాలు లేకుండా.
Negatives :-
- పాటలు సినిమా కథకి అడ్డంగా వస్తాయి.
- కొన్ని లాజిక్స్.
- లెంగ్త్ ఎక్కువ.
Overall :-
మొత్తానికి కార్పొరేటర్ అనే సినిమా శంకర్ కెరియర్ లో ది బెస్ట్ ఫిలిం గా నిలుస్తుంది అనే విషయం లో ఎటువంటి సందేహం లేదు. సినిమా మొదటి నుంచి శంకర్ తన నటనతో ప్రేక్షకులని అలరిస్తారు. కథ మరియు కధనం బాగుంది. దర్శకుడు చెప్పాలనుకుంది ఎక్కడ అనవసరపు సన్నివేశాలు లేకుండా దర్శకత్వం వహించారు.
మ్యూజిక్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి శంకర్ నటన కోసం ఈ కార్పొరేటర్ సినిమా హ్యాపీ గా కుటుంబం అంత కలిసి ఓసారి చూసేయచ్చు.
Rating :- 2.5/5