Today Telugu News Updates

భారత్ లో కరోనా విజృంభణ, Coronavirus cases in India

 భారతదేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. coronavirus cases in India 5,49,194 కరోనా వైరస్ ను కట్టడి చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కత్తి మీద సాములా మారింది . ఒక రకంగా చెప్పాలంటే కరోనా విషయంలో భారతదేశం చేతులెత్తేసినట్లుగానే రోజు పరిస్థితులు కనిపిస్తున్నాయి . కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా పలు రాష్ట్రాలు లాక్ డాన్  దిశ గా ఆలోచన చేస్తున్నాయి . ఇప్పటికే కేసులు పెరుగుదలతో మణిపూర్ లాక్ డాన్ పొడిగిం చింది . మహారాష్ట్ర మరియు తెలంగాణ కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది .

 ఆరు రోజుల్లోనే లక్షకు పైగా కేసులు కరోనా కేసులు పెరుగుదల చూస్తే తప్పక షాక్ అవుతారు . ఆరు రోజుల్లోనే లక్షకు పైగా కేసులు నమోవైన పరిస్థితి రాజుగా ఇండియాలో కనిపిస్తోంది . కరోనా వైరస్ ప్రారంభదశలో లక్ష కేసులు నమోదు కావడానికి 109 రోజుల సమయం పడితే , ఇప్పుడు ఆరు రోజుల్లోనే లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి . అంటే కరోనా కట్రోల్  లో మన ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పడ తప్పుడు .

coronavirus cases in India ::

 24 గంటల్లో 19700 మందికి కరోనా పాజిటివ్ అని అధికారికంగా చెప్పిన లెక్క , అనధికారికంగా కూడా ఇప్పటి ముబ్బడిగా కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితి ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది . మన దేశంలో గత 24 గంటల్లో 19700 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది . ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవేనని చెప్పారు . ఇలా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నా ప్రభుత్వాలు ఏం చేయలేని పరిస్థితి ప్రస్తుతం విస్మయం కలిగిస్తోంది . దేశంలో కరోవా వైరస్ కేసుల సంఖ్య ప్రస్తుతం 5,49,197. అనుపత్రులలో కరోనా పేషెంట్లకు  అందుతున్న వైద్యంలో కూడా అడుగడుగున లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి . వారికి సరైన ఆరోగ్య రక్షణ అందడం లేదని ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి .

 దేశవ్యాప్తంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 384 మంది . గత 24 గంటల్లో మృతిచెందారని అధికారకంగా విడుదల చేసిన జూబితాలో తేలింది . దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య ప్రస్తుతం చూపినట్లయితే 5,49 , 197 కేసులు నమోదయ్యాయి . ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 16,475 కి పెరిగింది .  2,10,120 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతుండగా , ఇప్పటివరకు 3.2 లక్షల మంది కరోనా నుండి కోలుకున్నట్లుగా తెలుస్తోంది . ఏదేమైనా కరోనా కేసులు పెరుగుతున్న తీరు మరొకసారి లాక్ డాన్ పై ప్రజుల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. కరోనాను కంట్రోల్ చేయ లేకపోతున్న ప్రభుత్వాలు పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోలోపల టెన్షన్ పడుతున్నాయి . అదే స్థాయిలో కరోనా కేసులు పెరిగితే భారతదేశ పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button