కరోనా రావడంతో చనిపోతానని బయమేసింది ! ఆ కామెంట్స్ వల్ల చాల బాధపడ్డాను.

tamanna bhatia : సోషల్ మీడియా ద్వారా సెలెబ్రిటీలు వారి సంతోషాన్ని, బాధని వారి అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. షోషల్ మీడియా ద్వారా అభిమానులు సెలెబ్రిటీ లనుండి నటనా పరంగా ఎం కావాలో వారి అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు.
అభిమానుల కెమెంట్స్ వల్ల బాధపడే సెలెబ్రిటీస్ కూడా ఉన్నారు. ఇటీవల తమన్నా కరోనా నుండి కోలుకొని ఇంటికి వచ్చింది. ఆ సందర్భంలో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పెట్టి, కరోనా రావడంతో చనిపోతానని బయమేసింది. మీ అభిమానం నావెంట ఉండడం వల్ల నేను కోలుకున్నాను, అలాగే డాక్టర్స్ కూడా నా పై శ్రద్ద పెట్టి నేను కోలుకునేలా చేసారు. అంటూ భావోద్వేగాలకు లోనవుతూ పోస్ట్ పెట్టింది.
కానీ కొందరు వ్యక్తులు నువ్వు లావు అయిపోయావ్, ఇక హీరొయిన్ కి పనికిరావు అన్నట్టు ఇన్ డైరెక్ట్ గా కామెంట్ పెట్టడంతో నేను చాల బాదపడ్డానని, కరోనా వల్ల వాడిన మందుల ప్రభావం ఉండటంతో లావు అయ్యానని తన బాధను తెలిపింది.