corona vaccine price in india: బయటి మార్కెట్ లో కరోనా వ్యాక్సిన్.. రేటు ఎంతయి ఉంటుంది..పేదవారికి అందుతుందా… ? పూర్తీ వివరాలు మీకోసం…

corona vaccine price in india : కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ ను ,కరోనా రోగులకు సేవలందించిన వారికీ ఉచితంగా మొదటి డోసును అందించింది. ఇప్పుడు మొదటి దశ డోసు ఇచ్చిన ప్రభుత్వం రెండవ డోస్ ను ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తుంది. ఈ సందర్బంగా మార్చి 1 నుండి బయటి మార్కెట్ లో కరోనా వ్యాక్సిన్ ను ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది.
ఇప్పటికే కొన్ని సంస్థలకు అనుమతులు మంజూరు చేసారు. ఈ విషయాన్నీ అధికారికంగా త్వరలో ప్రకటించనుంది.
అయితే కరోనా వాక్సిన్ రేటు ఎంతుంటుందో అని సామాన్య ప్రజలు భయపడుతున్న సమయంలో .. కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ రేటును కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో డోసుకు రూ.500 మించకూడదు అంటూ తెలిపింది. కంపెనీలు ఎవరిష్టమొచ్చినట్టు వారు వ్యాక్సిన్ రేటు పెంచకూడదని ఆదేశాలు జారీచేసింది.
ఇప్పటికే కేంద్రం ఇపుడు అందిస్తున్న వాక్సిన్ తో పాటు మరికొన్ని వాక్సిన్లకు అనుమతి ఇవ్వనున్నారని సమాచారం.