Control Food Poison in Fridge: ఫ్రిడ్జ్ లో ఫుడ్ పాయిజన్ కాకుండా ఉండాలంటే ఇలా నిలువ చేయండి!
Control Food Poison in Fridge : మనం ఒక ఆహార పదార్థాన్ని నిలువ ఉండడానికి మనం ఫ్రిడ్జ్ లు వాడుతూ ఉంటాం. అయితే కొందరు సరైన నియమాలు పాటించకుండా ఫ్రిడ్జ్ లో ఆహారాన్ని నిలువ ఉంచడంతో ఆ ఫుడ్ కాస్త ఫుడ్ పాయిజన్ గా మారుతుంది. అది తింటే మన రోగాల బారిన పడతాము. కొన్నిసార్లు ప్రాణం పోయే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఫ్రిడ్జ్ లో ఫుడ్ పాయిజన్ కాకుండా ఉండాలంటే ఇలా నిలువ చేయండి :మొదట మనం నిలువ చేస్తున్న ఆహార పదార్థాన్ని ఆప్టిమమ్ టెంపరేచర్ లో ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఆ తర్వాత సర్టెన్ టెంపరేచర్ లో మైక్రోవేవ్లో వేడి చేసి తినాలి. ఇంతకంటే ఎక్కువ ఫుడ్ ని ఫ్రిడ్జ్ ఫుడ్ ని నిలువ చేస్తే బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో అది ఫుడ్ పాయిజన్ అవుతుంది.

నాన్ వెజ్ ఒక్కరోజుకు మించి స్టోర్ చేయవద్దు. అంతకంటే ఎక్కువ చేస్తే ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంది. వెజిటేబుల్స్ ఒక వారం కన్నా ఎక్కువ స్టోర్ చేయరాదు. కోసిన పండ్లను ఒక్క రోజుకు మించి ఫ్రిజ్లో ఉంచరాదు. కూరగాయలైన, ఫ్రూట్స్ ఐనా కలర్ చేంజ్ అయినట్టయితే వాటిని తినకూడదు. మనం ఫ్రిడ్జ్ ని షార్ట్ పెరిడ్ మాత్రమే యూస్ చేయవచ్చు. ఎక్కువ రోజులు అందులో ఉంచిన ఆహారం తీసుకుంటే అనారోగ్య బారిన పడాల్సి వస్తుంది.