Viral news in telugu
Complete Telugu Medium : ఇక ఎల్కేజీ నుంచి ఇంజనీర్ వరకు తెలుగు మీడియమే? మరీ ఇంగ్లీష్ మీడియం ?
Complete Telugu Medium : సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వార్త సంచలనంగా మారింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రగతి మైదానంలో నూతన జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టి మూడు సంవత్సరాలు అయినందున ప్రసంగించారు. మాతృభాషతో రాజకీయం చేసేవారు ఇక దుకాణం బంద్ చేసుకోవాలన్నారు. ఇక ఎల్కేజీ నుండి ఇంజనీర్ వరకు చదువు అంత వాళ్ళ మాతృభాషలోనే ఉంటుందని తెలిపారు.

తాను కూడా ఐక్యరాజ్యసమితిలో మాతృభాషలోనే మాట్లాడానని దీంతో మొదట అక్కడ ఉన్నవారికి అర్థం కాలేదు ఆ తర్వాత వాళ్లే చప్పట్లు కొట్టారని తెలిపారు.అయితే ప్రధాని మోదీ మాతృభాషలోనే విద్య కొనసాగుతుందని చెప్పడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొందరు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే మరి కొందరు ఇంగ్లీష్ భాష కూడా ముఖ్యమైందేనని… ఇంగ్లీష్ మీడియం తీసేయడం కరెక్ట్ కాదని పేర్కొంటున్నారు.