best web series reviews

పునర్నవి భూపాళం నటించిన కమిట్ మెంటల్ (2020)

commitmental web series:: సినిమా :- కమిట్ మెంటల్ (2020)
నటీనటులు :- ఉద్భవ రఘునందన్ , పునర్నవీ
మ్యూజిక్ డైరెక్టర్:-  ఆనంద్ సుధీర్  
డైరెక్టర్ :-  పవన్ సాదినేని 

కథ:-
ఈ కథ అమెరికా నుంచి రిటర్న్ వచ్చే ఫణి(ఉద్భవ రఘునందన్) అనే యువకుడు ల్యాండ్ అవగానే వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ అయినా అను ( పునర్నవీ) ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకుందాం అనే ప్రపోసల్ పెడ్తాడు. అను ఆలోచనలో పడుతూనే ఎస్ అంటుంది కానీ తనకి ఫణి యొక్క పొస్సెస్సివ్ నెస్ నచ్చదు. ఇపుడిపుడే తాను సొంతంగా ఉద్యోగం చేస్తూ జీవితం ఆనందంగా గడుపుతుంది. ఆలోచనలో పడ్డ అను ఒక చిన్న వెడ్డింగ్ సంఘటన ఆమె ఆలోచనని మరింత గట్టిగ పెంచేలా చేస్తుంది. చివరికి వారిద్దరూ పెళ్లి చేసుకోకూడదు అని డిసైడ్ అవుతారు.అసలు వాళ్ళ ప్రాబ్లెమ్ ఏంటి ? వాళ్ళు పెళ్లి చేసుకుంటారా లేదా? చివరికి ఎం జరుగుతుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ ఆహ లో చూసేయాల్సిందే..

👍

*  ఉద్భవ రఘునందన్ మరియు  పునర్నవీ తమ నటనతో ఆకట్టుకుంటారు.. 
* సినిమాకి సంబంధించిన ప్రతి ఒక క్యారెక్టర్ తమ తమ పాత్రకి న్యాయం చేసారు. 
*  కధనం చక్కగా వ్రాసుకున్నారు. 
* దర్శకుడు తాను చుపించాలనుకుంది సైడ్ ట్రాక్ లేకుండా చూపించారు
* బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొత్తగా ఉంది. 
*సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.
*  ప్రొడక్షన్ విలువలు కూడా చాలా బాగున్నాయి.

👎

* అక్కడక్కడ నిదానంగా అనవసరపు ల్యాగ్ ఉండటం వల్ల బోర్ కొడుతోంది. 

ముగింపు :-
మొత్తానికి ఈ కమిట్ మెంటల్ అనే వెబ్ సిరీస్ ఆఫీసియల్ గా హిందీ పెర్మనెంట్ రూమ్ మేట్స్ రీమేక్ ఏ అయినా దర్శకుడు పవన్ సాధినేని ఈ వెబ్సెరీస్ చాల బాగా హ్యాండిల్ చేసారు. 5 ఎపిసోడ్స్ తో కూడా ఈ వెబ్ సిరీస్ ఎక్కడ బోర్ కొట్టదు. ఫణి మరియు అను పాత్రలే మీకు కనబడుతాయి కనువిందు చేస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. కెమెరా పని తీరు బాగుంది. మొత్తానికి ఈ వెబ్సెరీస్ అని వర్గహల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఈ వారం కుటుంబం అంత కలిసి చూసేయచ్చు..

commitmental web series రేటింగ్ :- 2.75/5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button