Comedy Director is going to direct Mega Star Soon : మెగా స్టార్ ని దర్శకత్వం వహించేందుకు సిద్ధం అవుతున్న కామెడీ డైరెక్టర్ :-

Comedy Director is going to direct Mega Star Soon : అవును త్వరలో మెగా ఫోన్ పట్టుకునేందుకు సిద్ధం అవుతున్న స్టార్ కామెడీ డైరెక్టర్. ఇంతకీ ఆ కామెడీ డైరెక్టర్ ఎవరు అని అనుకుంటున్నారా.
ఈరోజుల్లో సినిమా నుంచి మహానుభావుడు , ప్రతిరోజు పండుగే వరకు చేసిన అన్ని సినిమాలు డిఫరెంట్ కామెడీ యాంగిల్ ప్రాజెక్ట్ చేస్తూ ఎప్పుడు ఫెయిల్ అవ్వకుండా వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన డైరెక్టర్ మారుతీ. ఇప్పటికే మీకు మ్యాటర్ అర్ధం అయింటది. త్వరలో మెగాస్టార్ చిరంజీవి ని దర్శకత్వం వహించబోయేది దర్శకుడు మారుతీనే.
ఇటీవలే అయన చేసిన మంచిరోజులొచ్చాయి అనే సినిమా కూడా హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ అనే టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు మారుతీ పక్క కమర్షియల్ సినిమాతో బిజీ ఉన్నారు.
అయితే మంచిరోజులొచ్చాయి సినిమా ప్రొమోషన్స్ సమయం లో ఆయనే స్వయంగా చెప్పారు. సైరా నరసింహ రెడ్డి హీరో గారు కథ నచ్చి ఓకే చేశారు. త్వరలో ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మన్నారు అని చెప్పారు. ఈ మాట వినగానే మెగా అభిమానులు చాల హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీనికి గల కారణం చిరు కామెడీ టైమింగ్ ని కామెడీ డైరెక్టర్ మారుతీ పర్ఫెక్ట్ గా చూపిస్తారు అని అనుకుంటున్నారు.
అదే కనుక జరిగితే చాల సంవత్సరాల తర్వాత చిరు ని కంప్లీట్ కామెడీ యాంగిల్ లో చూడబోతున్నాము. త్వరలో మారుతీ ఫుల్ నరేషన్ ఇచ్చాక అధికారిక ప్రకటన జరుగుతుంది. చూడాలి మరి ఈ కాంబినేషన్ ఏ రేంజ్ లో హిలేరియస్ గా ఎంటర్టైన్ చేస్తుందో.