Colgate: 17 రూపాయలు ఎక్కువ వసూలు చేశారని కోల్గేట్ పేస్ట్ పై కస్టమర్ కేసు.. 65వేలు ఫైన్..
Colgate: మనం రోజుకి ఎన్నో వస్తువులు కొనుగోలు చేస్తాం. అందులో కొన్ని వస్తువుల తయారీ యాజమాన్యాలు మాక్సిమం రిటైల్ ప్రైస్ అని చెప్పి ఆ వస్తువుపై అడ్డగోలుగా పైసలు వసూలు చేస్తున్నారని అనుకుంటాం… ఎవరు దాన్ని ప్రశ్నించాం.. అసలు దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని మనం కూడా పట్టించుకొము… కానీ ఒకతను మాత్రం అలా కాదు తన దగ్గర నుండి 17 రూపాయలు ఎక్కువ వసూలు చేసిందని కోల్గేట్ పేస్ట్ పై కోర్టులో కేసు వేసి.. యాజమాన్యానికి ఫైన్ విధించేలా చేశాడు .

సంగారెడ్డికి చెందిన సీహెచ్ నాగేందర్ అనే వ్యక్తి..2019 ఏప్రిల్ 7న రిలయన్స్ ఫ్రెష్ రిటైల్ మాల్లో 150 గ్రాముల కోల్గేట్ మాక్స్ టూత్ పేస్ట్ ను రూ. 92. కొనుగోలు చేయగా..అలాగే 20 గ్రాముల కోల్గోట్ మాక్స్ టూత్‌పేస్ట్ ను రూ.10 కి కొనుగోలు చేశారు. దీంతో ఈ ధరలను చూసిన నాగేందర్ కి ఒక సందేహం వచ్చింది
20 గ్రాముల పేస్ట్ 10 రూపాయలు ఉన్నప్పుడు.. 150 గ్రాముల పేస్ట్ రూ.75 ఉండాలి.. కానీ వీళ్ళు 95 రూపాయలు వసూలు చేస్తున్నార అంటే 17 రూపాయలు కస్టమర్ ల నుండి కోల్గేట్ యాజమాన్యం ఎక్కువ వసూలు చేస్తుందని వినియోగదారుల ఫోరం లో ఫిర్యాదు చేశాడు.
దీంతో వినియోగదారుల ఫోరం కేసును క్షుణ్ణంగా పరిశీలించి శుక్రవారం తుది తీర్పును వెల్లడించింది. కోల్గేట్ సంస్థ వారు అదనంగా 17 రూపాయలు వసూలు చేసినందుకు 65 వేల జరిమానా విధించింది.