Tollywood news in telugu

RRR టీమ్ ను అందరిని వణికించింది… ఎవరిని వదల్లేదు..

RRR Team video

RRR Team video: తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా చలిపులి అందరిని వణికిస్తుంది. అసలే ఈ సంవత్సరం చలి తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ ముందే తెలియజేసింది.

గత రెండు వారాలనుండి చలి తీవ్రత పెరిగినతరుణంలో అవేమి పట్టించుకోకుండా జక్కన్న టీమ్ ఆర్ఆర్ఆర్  సినిమా షూటింగ్ మాత్రం జరుగుతూనే ఉంది. దీన్ని బట్టి జక్కన్న టీమ్ ను ఎంత కష్టపెడుతున్నాడో తెలుస్తుంది.

షోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ టీమ్ కి సంబందించిన చలికి వణుకుతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వీడియోలో దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్‌ తదితర యూనిట్‌ చలికి వణుకుతూ ఉన్నారు .

బాహుబలి బ్లాక్‌బస్టర్‌ హిట్ తరువాత జక్కన్న తెరకెక్కిస్తోన్న ఈ మూవీ లో రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా ,ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, వీరి సరసన ఒలివియా, అలియా భట్ నటిస్తున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button