Political News

సీఎం జగన్ ఒక్క రోజు ఆదాయం ఎంతో తెలుసా..?

CM Jagan knows a lot about one day income

రాజకీయాల్లో వేడిపుట్టించే సంచలనాల  టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి వార్తలో నిలిచారు. అయితే జేసి తాజాగా  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదాయంపై కామెంట్‌ విసిరారు. ఈ సందర్బంగా అతని మాటలు సంచలనమయ్యాయి.

ఈ రోజు  అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ఒక రోజు కు  రూ. 300 కోట్లు సంపాదిస్తారని  చెప్పుకొచ్చారు. ఈ అంఖ్య పార్టీలలో,ప్రజలలో ఎక్కువ ప్రచారంలో ఉందన్నారు.  అయితే ఇది ఎంతవరకు నిజమో..? అబద్ధమో..? తెలియదని చెప్పారు.

ఇక్కడ జరిగే  ఎన్నికల్లో డబ్బు ప్రభావంతోనే  జగన్‌ విజయం సాధిస్తారని అన్నారు. చంద్రబాబు నాయుడు  తన  నియోజకవర్గం కుప్పంను బాగా అభివృద్ధి చేశారని. డబ్బులు వెదజల్లలేకే  ఓడిపోయారన్నారు.

కుప్పంలో  అధికార పార్టీ డబ్బుకు తోడు పోలీసులు కూడా బయపెట్టారన్నారు.  ఇక ఇక్కడి ప్రజలు వారికీ అభివృద్ధి చూసి వైసీపీకి ఓటేశారని చెప్పడం వింటూవుంటే విడ్డురంగా ఉందని తెలిపారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button