Today Telugu News Updates
కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం శుభవార్త !

ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగం చేస్తున్నవారికి సీఎం జగన్ శుభవార్తను అందించారు. వీరి సర్వీసును టైం ను పొడిగించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం,న్యాయ శాఖ, పాఠశాల, ఉన్నత విద్యాశాఖ, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసును 2021 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు.
వీరికి సకాలంలో జీతాలు అందేలా చూడాలని ప్రభుత్వ అధికారులను కోరారు, అదేవిదంగా పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగానే వారికి సామాజిక, ఆరోగ్య భద్రత విషయంలో అధ్యయనం చేయాలని, ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలని సీఎం జగన్ అధికారుల్నిఆదేశించారు.