Political News

Gram Panchayat funds మహేష్ బాబు సినిమాలోని ఫార్ములా వాడిన సీఎం కేసీఆర్ … !

Gram Panchayat funds

Gram Panchayat funds : కేసీఆర్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. దీనికి సంబంధించిన జీవో కూడా రిలీజ్ చేసింది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే… గ్రామపంచాయితీ లో జమ ఐన మొత్తంలోనుండి పంచాయితీల తీర్మానం మేరకు ఖర్చు చేసుకునే వెసులుబాటును కల్పించింది.

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 91 ప్రకారం ఇకనుండి గ్రామా పంచాయితీల  అభివృద్ధి మేరకు నిధులను ఖర్చుచేసుకునే వెసులుబాటు ఇచ్చింది. పంచాయితీ నిధులను నిబంధనలమేరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని,  ఆర్థిక సంవత్సర కేటాయింపులకు మించకుండా మాత్రమే ఖర్చు చేయాలని కూడా ప్రభుత్వం సూచించింది.

మొన్నటి వరకు లక్ష వరకు అయ్యే పనులకు డీపీఓలఅనుమతి, లక్ష కన్నా ఎక్కువ ఖర్చయ్యే పనులకు ఆ పై  అధికారుల అనుమతులు అవసరం ఉండేది. ఇక మీదట జీవో 91 ప్రకారం పై అధికారుల అనుమతులు లేకుండానే నిధులను నిబంధనలమేరకు సద్వినియోగం చేసుకోబోతున్నాయి. ఈ జీవో రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు, ప్రజలకు ఇదొక మంచి పరిణామం అని  ప్రభుత్వం భావిస్తోంది.

పై ఫార్ములాను గతంలో మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాలో ఒక సీన్ ఉడటం  మనం చూసాం. ఇపుడు మన తెలంగాణ ప్రభుత్వం అచ్చం సినిమాలోని ఫార్ములాను అమలు చేస్తుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button