Clove: షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కా మీకోసమే
లవంగాలు ఆహార పదార్థాలకు చక్కని రుచి, సువాసనను అందించడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. ప్రతిరోజు భోజనం ముగించగానే ఒక లవంగాన్ని నమిలి తింటే ఎలాంటి ఆరోగ్య లాభాలు కలుగుతాయో చూడండి.
లవంగాలను షుగర్ వ్యాధిగ్రస్తుల పాలిట అద్భుత వరం అని చెప్పవచ్చు. లవంగాలలో ఉండే ఇన్సులిన్ వంటి సుగుణాలు రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్దీకరిస్తాయి. అందువల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.

లవంగాలు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. జీర్ణాశయం, పేగులు శుభ్రపడతాయి. గ్యాస్, అసిడిటి, వికారం, అజీర్ణం తగ్గిపోతాయి.
లవంగాలు పురుషుల్లో కామోద్దీపనం కలిగిస్తాయి. శృంగారంలో పాల్గొనే ముందు లవంగాలను తింటే అవి శరీరాన్ని వేడెక్కించి మీ భాగస్వామితో ఎక్కువసేపు రతిని జరిపేందుకు దోహదపడతాయి.
లవంగాలు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను పుష్కలంగా కలిగి ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలను దూరం చేస్తాయి.