Clash between Super Star and Vishal along Aarya : సూపర్ స్టార్ రజిని తో పోటీకి సిద్ధమైన విశాల్ మరియు ఆర్య :-

Clash between Super Star and Vishal along Aarya : అవును ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. రజిని మరియు విశాల్ సినిమాలు పోటాపోటీగా ఒకే రోజున విడుదల అవబోతున్నాయి అని. కానీ ఈ సినిమాలలో జనాదరణ ఎక్కువ ఏ దానిపైన ఉందని చెప్పమంటే కష్టమైనా పనే అని చెప్పాలి.
ఒక పక్క సూపర్ స్టార్ రజిని గారు ఇంకోపక్క కంటెంట్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్ అయినా విశాల్ మరియు ఆర్య. ఇలా ఎందుకు ఒకేరోజు పోటాపోటీగా విడుదల చేస్తున్నారో అర్ధం కావడం లేదు. ఒక తమిళనాడు లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఈ రెండు సినిమాల మధ్య డబ్బింగ్ అయ్యి మరి పోటాపోటీగా విడుదలకు సిద్ధం చేశారు.
అయితే రజినీకాంత్ సినిమాలకు ఎక్కువ జనాదరణ ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రజినీకాంత్ గారు , నయనతార , మీనా , కీర్తి సురేష్ దానికితోడు ఎమోషనల్ సినిమాలు బాగా తీసే దర్శకుడు శివ. ఇలా వీరందరూ కలిసి పెద్దన్న గా తెలుగు లో రాబోతున్నారు. ట్రైలర్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఎడిట్ చేసి రిలీజ్ చేసారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ట్రైలర్ తరుపున మంచి ఆదరణ వచ్చింది.
ఇంకోపక్క విశాల్ మరియు ఆర్య కలిసి మొట్టమొదటి సారి కలిసి నటించిన ఎనిమి కంప్లీట్ యాక్షన్ లోడెడ్ విత్ కంటెంట్ అని ట్రైలర్ చూడగానే అర్ధం అవుతుంది. ట్రైలర్ అంత యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు మరియు కథ కూడా బలంగా ఉన్నట్లు అనిపిస్తుంది.
కానీ ఈ రెండు సినిమాలు ఎందుకు ఒకేసారి విడుదల అయ్యి క్లాష్ అవ్వబోతుందో అర్ధం అవ్వడం లేదు. రెండు సినిమాలు దీపావళి కానుకగా నవంబర్ 4 న విడుదల కాబోతుంది. చూడలి మరి రెండు సినిమాలలో ఏ దానికి ఎక్కువ జనాదరణ ఉండబోతుందో మరో 4 రోజులో తెలిసిపోతుంది.