Clash between Naga shoruya and Akash Puri : నాగ శౌర్య Vs ఆకాష్ పూరి :-

మరల ఒకేరోజు రెండు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు రిలీజ్ అయ్యి పోటాపోటీ పడబోతున్నాయి. ఒకటి నాగ శౌర్య , రీతూ వర్మ కలిసి చేసిన ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా వరుడు కావలెను. ఇంకోటి ఆకాష్ పూరి హీరో గా చేసిన రెండవ సినిమా రొమాంటిక్.
ఇటీవలే రొమాంటిక్ సినిమా ట్రైలర్ విడుదల అయ్యి యువత మనసులని వెంటనే లాగేసుకుంది. రొమాంటిక్ ట్రైలర్ విడుదలైన కొద్దీ గంటలకే విపరీతమైన ఆదరణ పొందింది. పూరి గారి మార్క్ ఎలివేషన్స్ మరియు కథ కొత్తగా ఉండబోతుంది అని అందరికి అనిపించేలా కట్ చేసారు ట్రైలర్ ని.ఈ సినిమా అక్టోబర్ 29 న విడుదలకు సిద్ధం అయింది.
ఇంకోపక్క నాగ శౌర్య వరుడు కావలెను సినిమా. ఈ సినిమా మొదటి నుంచి ఇప్పటిదాకా అని వర్గాల ప్రేక్షకులని అలరిస్తూనే వచ్చింది. పాటలు కూడా బాగున్నాయి. ట్రైలర్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. అయితే ఈ సినిమా కూడా అదే రోజు అనగా అక్టోబర్ 29 న విడుదలకు సిద్ధం చేసారు.
ముందుగా వరుడు కావలెను మరియు రొమాంటిక్ సినిమాలు వేరే వేరే విడుదల తేదీని ప్రకటించారు కానీ , కొని అనివర్య కారణాల చేత రెండు సినిమాలు ఒకేరోజు పోటాపోటీగా విడుదలకు సిద్ధం అయ్యేలా చేసారు.
వరుడు కావలెను సినిమా ముందుగా అక్టోబర్ 15 న విడుదలకు సిద్ధం చేసారు , తర్వాత నవంబర్ 4 న విడుదల చేస్తాం అని పోస్ట్ పోన్ చేసారు , చివరికి ప్రీపోన్ చేసి అక్టోబర్ 29 న విడుదలకు ఫిక్స్ చేసారు. ఇంకోపక్క రొమాంటిక్ సినిమా దసరా రోజు నవంబర్ 4 న విడుదల ఫిక్స్ అని అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి వారం రోజులు కూడా కాకుండానే రొమాంటిక్ సినిమా ప్రీపోన్ చేస్తున్నాం అని అక్టోబర్ 29 న విడుదలకు సిద్ధం చేసారని అధికారికంగా ప్రకటించారు.
మొత్తానికి అనుకోకుండానే రెండు సినిమాలు పోటపోటీగా విడుదలకీ సిద్ధం అయింది. రొమాంటిక్ సినిమాకి యువత ఎక్కువ పోతారని అనుకుంటే వరుడు కావలెను సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ పోతారని ట్రైలర్ కట్ చూసాక అర్ధం అయింది.
చూడాలి మరి రెండు సినిమాలలో ప్రేక్షకులు మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఏ దానికి పోతారో అనేది త్వరలో తెలిసిపోతుంది.