Tollywood news in telugu
నేటి నుండి ప్రారంభం కానున్న సినిమా థియేటర్లు !

కరోనా మహమ్మారి కారణంగా ఇన్ని నెలలుగా మూతబడ్డ సినిమా థియేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈరోజు ముక్కోటి ఏకాదశి కావడంతో యాజమాన్యాలు థియేటర్లను పున:ప్రారంభించారు. సుమారుగా తొమ్మిది నెలల తర్వాత థియేటర్లు తెరచుకున్నాయి .
ఈ రోజు శుభదినం కావడంతో తెలుగు భారీ బడ్జెట్ ‘సోలో బతుకే సో బెటర్’ సినిమా థియేటర్లోకి నేరుగా విడుదలవుతోంది. కరోనా ను దృష్టిలో ఉంచుకొని మాస్క్, సోషల్ డిస్టెన్స్ పాటించేలా థియేటర్ల యాజమాన్యాలు, సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రేక్షకులకు ముందుగా ధర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే థియేటర్ లోపలికి అనుమతిస్తామని థియేటర్ సిబ్బంది వెల్లడించింది.