Movie: సిండ్రీలా (2021) – Cinderella Review

Movie Review :- Cinderella (2021)
Star Cast: రాయ్ లక్ష్మి , సాక్షి అగర్వాల్ ,
Producers: సుబ్బయ్య , సేతు పాండియన్ , అభిలాష్
Music Director:- అశ్వ మిత్ర
Director: Vino Venkatesh
Story:-
ఈ కథ దెయ్యం చేత ఒక మనిషి చనిపోయే సన్నివేశం తో మొదలవుతుంది. తదుపరి అకిరా ( రాయ్ లక్ష్మి ) ని సౌండ్ డిజైనర్ గా హాలీవుడ్ ఫిలిమ్స్ లో వర్క్ చేస్తున్నట్లు ఉంటుంది. అయితే ఆ మనిషి చనిపోయిన ప్రదేశము లో అకిరా ఉండటం తో పోలీస్ లు అకిరా ని అరెస్ట్ చేసి ఇంటరాగేషన్ చేస్తుంటారు. కానీ అకిరా కి ఏమి తెలియదు తాను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేయాలనీ విశ్వా ప్రయత్నాలు మొదలుపెడుతుంది. తాను ఆ ప్రదేశము లో బర్డ్స్ యొక్క సౌండ్స్ రికార్డు చేయడానికి వచ్చాను తప్ప ఇంకా ఎం తెలియదు అని, కానీ ఎవ్వరు నమ్మరు. ఈ ప్రాసెస్ లోనే తాను ఒక షాప్ లో సిండ్రెల్లా డ్రెస్ చూసి చాల బాగా నచ్చడం తో డబ్బులు ఎక్కువ పేటి మరి కోనేస్తుంది. ఇక్కడినుంచి అసలైన కథ మొదలవుతుంది. అకిరా ఆ సిండ్రెల్లా డ్రెస్ ఇంటికి తీసుకొని వెళ్ళినప్పుటినుంచు ఇంట్లో అన్ని ఘోస్ట్ మరియు స్కేరీ సంఘటనలే జరుగుతుంటాయి. ఇదిలా ఉండగా ఇంకో పక్క దెయ్యం చేత రమ్య (సాక్షి అగర్వాల్ ) చనిపోతుంది. దెయ్యం తదుపరి టార్గెట్ గా రమ్య వాలా అమ్మని చంపాలని ప్రయత్నాలు మొదలవుతాయి. అసలు దెయ్యం ఎవరు ? సిండ్రెల్లా డ్రెస్ కి దీనికి సంబంధం ఏంటి ? ఎందుకు వరుసబెట్టి టార్గెట్ చేసి మరి చంపుతుంది ? వీరికి అకిరా కి గతం లో ఏమైనా సంబంధం ఉందా? సిండ్రెల్లా డ్రెస్ కి అకిరా కి కనెక్షన్ ఏంటి ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.
Plust Points 👍🏻:-
- లక్ష్మి రాయ్ ఎప్పటిలా కాకుండా కథను మరియు పాత్రను నమ్మే ఈ పాత్ర చేసింది , మరియు లక్ష్మి రాయ్ నటన చాల బాగా చేసింది. ప్రేక్షకులను అలరిస్తుంది.
- కొన్ని స్కేరీ సన్నివేశాలు.
- కథ.
- ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.
- సినిమాటోగ్రఫీ బాగుంది.
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాల బాగుంది మరియు సినిమాకి చాల ప్లస్ అయింది.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
Negative Points 👎🏻:-
- కథనం.
- దర్శకుడు కథ బాగా రాసుకున్నపటికి సరిగా కధనం రాసుకోలేకపోయారు.
- ఎగ్జిక్యూషన్ అసలు బాలేదు.
- అనవసరపు కామెడీ సన్నివేశాలు కావాలని అతికించినట్లు ఉంది.
ముగింపు :-
మొత్తానికి సిండ్రెల్లా అనే సినిమా కథ పరంగా బాగున్నప్పటికీ దర్శకుడు సరిగా కధనం రాసుకోకపోవడంతో ప్రేక్షకులని నిరాశ కలిగిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు సినిమాకి చాల ప్లస్ అయ్యాయి. లక్ష్మి రాయ్ కొత్తగా మరియు చాల బాగా నటించింది. మిగితా పాత్రధారులు కూడా బాగా చేశారు. ఘోస్ట్ సీన్స్ కొని స్కేరీ గా అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రాణం పోసింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కాకపోతే దర్శకుడు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయకపోవడం వల్లే సినిమా విఫలం అవడానికి కారణం అయింది. మొత్తానికి సిండ్రెల్లా సినిమా ఫ్లాష్ బ్యాక్ కోసం మరియు లక్ష్మి రాయ్ పెర్ఫార్మన్స్ కోసం ఓసారి చూసేయచు.
Rating:- 2.5/5