health tips in telugu

వర్షాకాలంలో ఇన్ఫెక్షన్స్ కి దూరoగా ఉండాలంటే ఈ ఫుడ్స్ ని ట్రై చేయండి

వర్షాకాలం వచ్చిందంటే చాలు జబ్బులు మొదలు. వర్షాకాలంలో అధికంగా వైరస్  మరియు బ్యాక్టీరియా ద్వారా ఇన్ఫెక్షన్ లు కలుగుతుంటాయి. దీని వలన కోల్డ్, ఫ్లూ, కలరా, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యు వంటి రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. అందువలన వర్షాకాలంలో తీసుకునే ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్ లో కొన్ని ఆహారాలకు మరియు అలవాట్లకు దూరంగా ఉండాలి. బయట లభించే డ్రింక్స్, స్నాక్స్ వంటి వాటికి దూరంగా ఉంటే మంచిది. లేదంటే రోగాలు తప్పవు. కావున నిపుణులు ఈ వర్షాకాలంలో మనం ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారాన్ని తీసుకోమని చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకోండి.

సూప్స్:

మీరు స్నాక్స్ తీసుకొనే సమయంలో చాట్ మరియు పకోడాలు లాంటి ఆహారాన్ని తినడానికి బదులుగా సూప్స్ తీసుకుంటే మంచిది. సూప్స్ పోషకాహారంతో నిండి ఉంటాయి. మరియు మన ఆకలిని తీరుస్తుంది. ఇవి సులభంగా జీర్ణం అవడమే కాకుండా డైజెషన్ సిస్టంలో తేలికగా ఉంటాయి. అల్లం, వెల్లుల్లి, మరియు నల్ల మిరియాలుతో తయారు చేసిన సూప్స్  త్రాగితే చాలా మంచిది. ఈ మసాలా దినుసులు సూప్ రుచిని పెంచడమే కాదు, మీ రోగనిరోధకతను మెరుగుపర్చడంలో కూడా సహాయపడతాయి. తేమ వాతావరణంలో ఇవి శరీరానికి హైడ్రెంట్ వలె పనిచేస్తుంది, ఇవి మీ శరీరంలో డీహైడ్రేషన్ ను వేగవంతం చేస్తుంది మరియు అలసట, వికారం రెండు పోతాయి.

స్మూతీస్:

వర్షాకాలంలో జ్యూసెస్ తీసుకోవడం మంచిది కాదు. అందువల్ల వాటిని స్మూతీస్ తో భర్తీ చేయడo ఒక మార్గం. కాలే, పాలకూర, క్యాబేజీ తదితర ఆకుకూరలని అవైడ్ చేసి, అవసరమైన పోషకాల కోసం దోసకాయలు, నారింజ, మామిడి, టమోటాలు వంటి ఆర్గానిక్ ఫుడ్ ని వాడండి. స్మూతీస్ తయారు చేయటం చాలా సులభమే కాదు, అవి సమయాన్ని కూడా ఆదా చేస్తాయి. ఈ స్మూతీస్ కి చియా సీడ్స్ ని కలిపి తీసుకుంటే ఇవి మీ శరీరం కోసం ఒక ఎనర్జీ బూస్టర్ లాగా పని చేస్తాయి.

ఉడికించిన కూరగాయలు:

కూరగాయలను ఉడికించడం వల్ల అవి సాఫ్ట్ గా మారుతాయి. వీటి వల్ల వాటి పోషక పదార్ధాలు అలాగే ఉంటాయి, ముఖ్యంగా విటమిన్ సి లాంటి నీటిలో కరిగే సమ్మేళనాలు అలాగే ఉంటాయి.  కూరగాయలని ఉడికించడం వల్ల వాటి నుండి క్రిములు తొలగిoచబడడమే కాకుండా వాటి ఆకృతి మరియు రుచిని అలాగే ఉంచడంలో సహాయపడుతుంది. ఉదాహరణకి బ్రోకలీ, పుట్టగొడుగులు, క్యారెట్లు మరియు టమోటాలు

మొక్కజొన్న:

మొక్కజొన్న వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రక్తపోటును తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది మరియు డయాబెటిస్ మేనేజర్ గా  పనిచేస్తుంది. కార్న్ ఫైబర్ మరియు పిండి పదార్ధాలతో సమృద్ధిగా ఉంటుంది, మరియు ఇది జీర్ణ వ్యవస్థ యొక్క సున్నితమైన పనితీరును నిర్ధారిస్తుంది. మొక్కజొన్న భేల్ చాలా ఆరోగ్యకరమైనది మరియు  అలాగే మీ రుచికి ఒక మంచి ట్రీట్ గా పని చేస్తుంది.

మొలకలు:

ఆరోగ్యానికి మొలకలు చాలా మంచివి మరియు వీటిని వర్షాకాలంలో  ఆహారంతో కలిపి తీసుకుంటే మన ఇమ్యునిటీని పెంచడంలో ఉపయోగపడతాయి. మీరు పచ్చ పెసరపప్పు, కాలా చనా, మరియు శనగలను తరిగిన ఉల్లిపాయ, టొమాటో మరియు నిమ్మరసంతో కలిపి తీసుకోవచ్చు. మీ స్ప్రౌట్ చాట్ ని పుల్లపుల్లగా మరియు రుచికరoగా  తయారుచేసుకొని అల్పాహారం, భోజనం మరియు స్నాక్ సమయం లో తీసుకోవచ్చు.

అల్లం:

అల్లం ఒక అద్భుతమైన స్పైస్ మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. తులసి అల్లం టీ, అల్లం మరియు నల్ల మిరియాలు టీ వంటి అల్లంతో తయారుచేసే హెర్బల్ టీలు మీ రోగనిరోధకతను పెంచుతాయి. ఇది క్రోమియం, మెగ్నీషియం మరియు జింక్ లను కలిగి ఉంటుంది, ఇది మొత్తం రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఇది కోల్డ్ మరియు ఫ్లూ కి వ్యతిరేకంగా సహాయపడే యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంది. వర్షాకాలంలో దగ్గు మరియు  జలుబు సాధారణ సమస్య. అల్లంలో ఉండే శ్వాసకు సంభందించిన లక్షణాలు ఊపిరితిత్తుల నుండి ఫ్లం( గల్ల)ని తొలగిస్తుంది. ఇది లంగ్స్ లో ఉండే టిష్యూస్ ని కూడా క్లీన్ చేస్తుంది.

పసుపు:

ఎల్లో రంగులో ఉండే ఒక స్పైస్ పౌడర్ పసుపు. ఇది అందరకు తెలిసిన వంటింట్లో ఉండే రోగనిరోధక శక్తిని పెంచే ఒక ఏజెంట్. ఇది ఒక అద్భుతమైన మసాలా మరియు వర్షాకాలంలో తప్పక తీసుకోవాలి. ఇది యాంటీ బాక్టీరియల్  మరియు యాంటీ ఇన్ ప్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది శరీరంలోని షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. ప్రతిరోజు పావు టీ స్పూన్ పసుపుని ఒక కప్ పాలలో కలిపి త్రాగితే వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ నుండి మనల్ని కాపాడుకోవచ్చు.

ఈ సూపర్ ఫుడ్స్ ని తీసుకొని వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ కి దూరంగా ఉండండి.

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button