Chiru to romance with Thamanna : చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ :-

Chiru to romance with Thamanna : మెగా స్టార్ చిరంజీవి తో నటించాలని మిల్కీ బ్యూటీ తమన్నా ఎప్పటినుంచో కంటున్నా కల ఇన్నాళ్లకి నెరవేరబోతుంది. అపుడెపుడో చిరు కం బ్యాక్ సినిమా ఖైదీ నెంబర్ 150 లో చిరు సరసన తమన్నా అనే అనుకున్నారు, కానీ చివరికి కాజల్ తో కానిచ్చేశారు.
చిరు కూడా రచ్చ సినిమా సమయం లో వాన వాన పాటలో తమన్నా డాన్స్ కి మెచ్చుకొని తనతో ఎలాగైనా సినిమా చేస్తాను అని హామీ ఇచ్చారని అందరికి తెలిసిందే. ఆ హామీ కాస్త ఇన్నేళ్లకు నెరవేరుతుంది.
మ్యాటర్ లోకి వెళ్తే చిరు ప్రస్తుతం వరుస సినిమాలు అనౌన్స్ చేసి అన్ని సినిమాలు ఒకేసారి బ్యాలన్స్ చేస్తూ షూట్స్ చేస్తున్నారు. అందులో ఆచార్య , గాడ్ ఫాదర్ , భోళా శంకర్ సినిమాలు షూటింగ్ మొదలవగా త్వరలో బాబీ దర్శకత్వం లో చిరు సినిమా షూట్ మొదలవనుంది.
ఇదిలా ఉండగా చిరు, మెహెర్ రమేష్ కలిసి తమిళ అజిత్ బ్లాక్ బస్టర్ సినిమా అయినా వేదాలమ్ ని రీమేక్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా లో చిరు చెల్లెలుగా కీర్తి సురేష్ నటించగా , చిరు లవర్ గా తమన్నా ని అనుకుంటున్నట్లు చిత్ర సీమలో టాక్.
తమిళం లో అజిత్ సరసన శృతి హస్సన్ నటించగా, తెలుగు లో శృతి హస్సన్ పాత్రని తమన్నా చేయబోతున్నారని తెలిసింది. చూడాలి మరి భోళా శంకర్ సినిమా లో తమన్నా , చిరు ఆన్ స్క్రీన్ పెయిర్ ఎలా ఉండబోతుందో.