Chiru Loves Remaking Films : చిరంజీవి మరియు రీమేక్స్ విడదీయని బంధం:-

Chiru Loves Remaking Films : మెగా స్టార్ చిరంజీవి అంటే మాస్ మరియు క్లాస్ కి మారుపేరు. చిరు కోసం స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదేమో. అయితే దాదాపు 10 ఏళ్ళు గ్యాప్ తీసుకొని మళ్ళి ప్రజల ముందుకు ఖైదీ 150 సినిమాతో వచ్చి స్ట్రాంగ్ రి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. దాని తర్వాత సైరా నరసింహ రెడ్డి తో చిరు స్టార్ డం ఎపుడు తగ్గదని అర్ధం అయింది.
ఇదిలా ఉండగా చిరు ప్రస్తుతం ఆచార్య సినిమా విడుదలకు సిద్ధం అయ్యారు. దీనితో పాటు అయన పుట్టిన రోజు సందర్బంగా వరుసబెట్టి అయన చేసే సినిమాల లిస్ట్ అనౌన్స్ చేశారు. అందులో రెండు రీమేక్స్ ఉన్నాయి. ఒకటి అజిత్ వేదాళమ్ సినిమాని తెలుగు లో చిరు మెహెర్ రమేష్ దర్శకత్వం లో భోళా శంకర్ గా చేయబోతున్నారు , ఇంకొకటి మలయాళం లో మోహన్ లాల్ బ్లాక్ బస్టర్ సినిమా లూసిఫెర్ ని తెలుగు లో గాడ్ ఫాదర్ గా చిరు చేయబోతున్నారు. ఈ సినిమాలు అప్పట్లోనే తెలుగులో డబ్ చేసి విదుదల కూడా చేశారు. అయినప్పటికీ చిరు రీమేక్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం సినీ వర్గాలలో చిరు ఇంకో రీమేక్ చేయబోతున్నాడని సమాచారం. అదేంటంటే గౌతమ్ మీనన్ దర్శకత్వం లో అజిత్, త్రిష , అనుష్క నటించిన ఎన్నై అరిందాల్ అని సినిమా తీసి సెన్సేషన్ హిట్ కొట్టారు.
అయితే ఈ సినిమాని అప్పట్లోనే తెలుగు లో ఎంతవాడు గాని అని డబ్బింగ్ చేసి విడుదల చేసారు. అందరు చూసి హిట్ కూడా చేసారు. కానీ ఇపుడు చిరు ఈ సినిమాని రీమేక్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ తరుపున ఈ సినిమా రైట్స్ ని ఇదివరకే కొన్నారని. ఈ సినిమాని తెలుగు లో ది బెస్ట్ చేయగలిగే డైరెక్టర్ కోసం వెతుకుతున్నారని తెలుసుతుంది. చిరు మరియు రీమేక్స్ విదదీయని అనుబంధం.
చిరు కి రీమేక్స్ చేయాలనిపిస్తే, డబ్బింగ్ కానీ సినిమాలు రీమేక్ చేసిన ఫ్యాన్స్ కి ఉత్సాహం ఉండేది . కానీ అందరు చుసిన సినిమానే రీమేక్ చేయడం తో ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ని ఎపుడు అనౌన్స్ చేయబోతున్నారో మరి.