Chiru Lends His Voice for a Prestegious Film : వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు సిద్దమయిన మెగా స్టార్ :-

Chiru Lends His Voice for a Prestegious Film : మెగా స్టార్ చిరంజీవి గారు చాల అరుదుగా తన సినిమాకి కాకుండా వేరే సినిమాలకి వాయిస్ ఓవర్ ఇచ్చేది. చిరుకి స్క్రిప్ట్ ఎంతగానో నచ్చితేనే నటించకపోయిన వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ సినిమా మీద ఉన్న హైప్ ను రెట్టింపు చేస్తారూ. అదే ఇపుడు ఒక సినిమాతో జరిగింది.
మ్యాటర్ లోకి వెళ్తే క్లాసిక్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్ అయినా కృష్ణ వంశి గారు చాల గ్యాప్ తీసుకొని తీస్తున్నా సినిమా రంగమార్తాండ. ఈ సినిమా లాక్ డౌన్ పడకముందే షూటింగ్ స్టార్ట్ అయింది. తర్వాత కరోనా అడ్డంకులు , షూటింగ్స్ కి అనుమతి లేకుండా ఉండటం. ఇలా అనేక రకమైన కారణాల చేత ఈ రంగమార్తాండ సినిమా మీద ఒక్క అప్ డేట్ కూడా రాలేదు.
ఇపుడు షూటింగ్స్ మొదలయ్యాయి , థియేటర్లకు సినిమాలు చూడటానికి జనాలు వస్తున్నారాని భావించి కృష్ణ వంశి గారు రంగమార్తాండ సినిమాకి సంబందించిన పుకార్లకు చెక్ పెడుతూ ఒక సప్రైజ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.
అదేంటంటే ఈ సినిమాలో వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు మెగా స్టార్ చిరంజీవి గారు ముందుకు వచ్చారని సోషల్ మీడియా లో చిరు వాయిస్ ఓవర్ ఇస్తున్న ఫోటో షేర్ చేసి కృష్ణ వంశి గారు వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. కృష్ణ వంశి చేసేది రీమేక్ సినిమానే అయినా తెలుగు నేటివిటీ కి తగ్గట్టు ఎన్నో మార్పులు చేసారని తెలుస్తుంది.
ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ , రమ్య కృష్ణ , బ్రహ్మానందం గారు , అనసూయ , శివాత్మిక మొదలగు ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. ఏదేమైనా ఇన్నాళ్లకి రంగమార్తాండ సినిమా మీద కృష్ణ వంశి గారు ఇంత పెద్ద అప్ డేట్ ఇయ్యడం మూవీ లవర్స్ కి చాల బాగా నచ్చేసింది. దానికి తోడు చిరు వాయిస్ ఓవర్ ఇస్తున్నారని తెలిసి సినిమా మీద హైప్ ఎక్కడికో పెరిగిపోయింది. చూడాలి మరి ఈ సినిమా ఎపుడు రిలీజ్ అవుతుందో అని వేచి చూడక తప్పదు.