అల్లు అర్జున్ కి ఆ అర్హత లేదంటూ చిరంజీవి అభిమానులు ఫైర్…ఆహా ఓటీటీ క్షమాపణ
అల్లు అర్జున్ కి ఆ అర్హత లేదంటూ చిరంజీవి అభిమానులు ఫైర్…ఆహా ఓటీటీ క్షమాపణ : ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న “సామ్ జమ్” షో కి…అగ్ర హీరోయిన్ సమంత హోస్ట్ గా అదరగొడుతున్నడంతో ప్రేక్షకుల నుండి భారీ స్పందన లభిస్తుంది.ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి,హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ డైరెక్టర్ క్రిష్ “సామ్ జామ్” షోలో పాల్గొన్న విషయం తెలిసిందే.

తాజాగా “సామ్ జామ్” షో లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1 న ఆహా ఓటీటీ లో రేలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో లో అల్లు అర్జున్ ఎంట్రీ అప్పుడు స్టైల్ స్టార్ అన్ని పెట్టకుండా మెగాస్టార్ అని పెట్టడంతో చిరంజీవి అభిమానులు …ఆహా ఓటీటీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగాస్టార్ అనే బిరుదు అల్లు అర్జున్ కే కాదు… ఏ హీరో కూడా పొందే అర్హత లేదని చిరంజీవి అభిమానులు మండిపడుతున్నారు. అల్లు అరవింద్ కి సొంత ఆహా ఓటీటీ ఉంటే తన కొడుక్కి మెగాస్టార్ అని బిరుదు ఇస్తారా? అంటూ చిరు అభిమానులు కోప్పడ్డారు
ఈ విషయంపై ఆహా ఓటీటీ యాజమాన్యం వెంటనే ట్విట్టర్ ద్వారా స్పందించి.. సాంకేతిక తప్పిదం వల్ల అలా జరిగిందని దయచేసి చిరు అభిమానులు క్షమించలని కోరింది. “మెగాస్టార్ ఒక్కరే ఉంటారు.. ఆది మనందరికీ తెలుసు” అంటూ ట్వీట్ చేశారు