Chiranjeevi New Movie Review : ఇది సినిమా అంటారా? చిరంజీవికి ఒక్క దండం..!
Chiranjeevi New Movie Review :
టైటిల్: భోళా శంకర్.
నటీనటులు: చిరంజీవి తమన్నా కీర్తి సురేష్ సుశాంత్ హైపర్ ఆది వెన్నెల కిషోర్ తదితరులు.
సినిమాటోగ్రఫీ: డుడ్లే.
సంగీతం: మహాటి స్వర సాగర్.
దర్శకత్వం: మెహర్ రమేష్.
నిర్మాత: కె ఎస్ రామారావు
విడుదల తేదీ : 11 August 2023.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా కీర్తి సురేష్ లు హీరోయిన్ లుగా నటించిన భోళా శంకర్ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మెహర్ రమేష్ దర్శకత్వం వహించడంతో… సినిమా పెద్ద రాడ్ అన్ని అందరూ ఊహించారు.. కానీ మూవీ, ట్రైలర్, సాంగ్స్ బాగానే ఉండడంతో మెగాస్టార్ తో మెహర్ రమేష్ హిట్ కొడతాడని ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. భోళా శంకర్ లో తమన్నా చిరంజీవికి జోడిగా నటిస్తే.. కీర్తి సురేష్ చెల్లెలుగా నటించింది.భోళా శంకర్ కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక కథలోకి వెళితే… కలకత్తాలో శంకర్ (చిరంజీవి) అనే టాక్స్ డ్రైవర్ ఉండేవాడు. అతను తన చెల్లెలు (కీర్తి సురేష్) ని చదివించి పెద్ద చేస్తాడు. శంకర్ కి చాలా బరువు బాధ్యతలు ఉంటాయి. అలాగే శంకర్ సమాజంలో ఎక్కడ ఆడపిల్లకు అన్యాయం జరిగిన సహించేవాడు కాదు… ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ శంకర్ టాక్సీ ఉండేది. వాళ్ల కోసం ఎవరినైనా ఎదిరించేవాడు. కలకత్తాలో ఒకానొక టైంలో అమ్మాయిల మిస్సింగ్ కేసులు క్రమగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ఉమెన్ ట్రాఫికింగ్ పోలీసులు శంకర్ సహాయం తీసుకొని వాళ్ళని పట్టుకుంటారు. అయితే ఈ నేపథ్యంలో శంకర్ చెల్లెలు ఇబ్బందుల్లో పడుతుంది. తన చెల్లెలకి శంకర్ సొంత అన్న కాడు అని తెలుసుకుంటుంది? అయితే ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఫ్లాష్ బ్యాక్ ఏంటనేదే మిగతా కథ..

ఈ భోళా శంకర్ వేదాలం సినిమాకి రీమేక్.. ఆయన తెలుగులో మెహర్ రమేష్ కొన్ని మార్పులు చేశారు. మెయిన్ స్టోరీ ని డిస్టర్బ్ చేయకుండా.. చిరంజీవి క్యారెక్టర్ మాత్రం మెగాస్టార్ అభిమానులకు నచ్చే విధంగా తెరకెక్కించారు. ఫస్ట్ ఆఫ్ లో అంతగా చెప్పుకునే సీన్స్ ఏమీ లేవు.. ఏదో వెన్నెల కిషోర్ కామెడీ.. చిరు కీర్తి సురేష్ లు క్లోజ్ అప్ లో బాగున్నారు. ఇక సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ ప్యాక్ ఉంటే..చిరు కీర్తి ల అన్నా చెల్లెల ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ కాలేదు . అలాగే సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అంతా కనెక్ట్ కాలేదు. అయితే 150 సినిమాల్లో వరస్ట్ సినిమా ఏదైనా ఉందంటే మెగాస్టార్ ది ఇదేనని సినిమా చూసిన ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
రేటింగ్:- 2.25/5