ఆర్ఆర్ఆర్ లో చిరంజీవి మరియు ఆమిర్ ఖాన్ !

RRR movie latest : రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. రియల్ కారెక్టర్స్‌తో కూడిన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా క్యారెక్టర్ లలో నటిస్తున్నారు . ఇంకా అజయ్ దేవగన్, శ్రియ, అలియా భట్, ఒలివియా, సముద్ర ఖని వంటి స్టార్లు ఇందులో ఒక పార్ట్ కానున్నారు.
ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు వేగంగా సాగుతుంది. అదేవిదంగా దీనికి సంబంధించిన మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది . అదేంటంటే ఈ ప్రాజెక్ట్‌లో ఆమిర్ ఖాన్ భాగం కానున్నాడని తెలుస్తుంది .
ఈ సినిమాలో తెలుగు వెర్షన్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కారెక్టర్‌లను చిరంజీవి పరిచయం చేయగా … హిందీలో ఆమిర్ ఖాన్ పరిచయం చేయనున్నాడని వార్తలస్తున్నాయి . అమీర్ తో ఉన్న సాన్నిహిత్యంతోనే రాజమౌళి అడగటం, ఆమిర్ ఓకే అనడం జరిగిపోయాయని సమాచారం.