హైదరాబాద్ లో చిన్నారి దారుణ హత్య, Child murder in Hyderabad
హైదరాబాద్ లో వివాహేతర సంబంధం Child murder in Hyderabad ఓ ముక్కు పచ్చ లారని చిన్నారి ప్రాణం తీసింది . ఆమె తల్లిపై కోపంతో ఓ వ్యక్తి పాప గొంతుకోసి హత మార్చాడు . ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఇస్మాయిల్ ఖాన్ గూడా విహారి ఎన్ క్లేవ్ లో గురువారం జరిగింది .
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన సూరనేని కల్యాణ్ రావు , ఎపి అనంతపురం జిల్లా గుత్తికి చెందిన అనుష్క 2011 లో ప్రేమ వివాహం చేసుకున్నారు . వీరికి ఐదేండ్ల పాప ఆద్య ఉంది . మూడేండ్లుగా పోచారం మున్సిపల్ పరిధిలోని ఇస్మాయిల్ ఖాన్ గూడా విహారి హోమ్ లో ఉంటున్నారు . కల్యాణ్ రావు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నారు .
Child murder in Hyderabad ::
అనుష్కకు కరుణాకర్ అనే వ్యక్తితో రెండేండ్ల కిందట పరిచయం ఏర్పడింది . భర్త లేని సమయంలో కరుణాకర్ తన స్నేహితుడైన రాజశేఖర్ తో కలిసి అనుష్క ఇంటికి వచ్చేవాడు . ఇది అనుష్క రాజశేఖర్ మధ్య సంబంధానికి దారితీసింది . దాంతో కరుణాకరను దూరం పెట్టడంతో అతను కోపంతో ఆమె ఇంటికి వెళ్లాడు . ఇంటి బయట ఆడుకుంటున్న ఆద్యను అడ్డు పెట్టుకొని వారిని బయటికి రావాలనీ , లేకపోతే పాపను చంపుతానని బెదిరించాడు . ఎంతకూ రాజశేఖర్ రాకపోవడంతో కత్తితో పాప గొంతు కోశాడు .
రాజశేఖర్ బయటకు రాగా అతనిపైనా దాడి చేశాడు . అనంతరం కరుణాకర్ తన రెండు చేతులు , గొంతు కోసుకున్నాడు . స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు చేరుకుని చిన్నారిని ఆస్పత్రికి తరలించారు . అప్పటికే తీవ్రంగా రక్తం పోయి పాప మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు . కరుణాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు . మల్కాజిగిరి డిసిపి రక్షితకృష్ణ మూర్తి , ఎసిపి నర్సింహ్మారెడ్డి ఘటన స్థలానికి చేరుకొని స్థానికులను వివరాలడిగి తెలుసుకున్నారు . కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రఘువీర్ రెడ్డి తెలిపారు .