చియా గింజలలో పోషక విలువలు వాటి పనితీరు

chia seeds in Telugu :: చియా గింజలు చూడటానికి చిన్నవిగా ఉండి అత్యధిక పోషక విలువలను కలిగి ఉంటాయి. వీటిని వైద్య రంగంలో విరివిగా ఉపయోగిస్తారు. ఇవి ‘సాల్వియా హిస్పానిక’ అనే మొక్కనుండి లభిస్తుంది.
ఈ చియా గింజలు మన శరీరం లోని కొవ్వును తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటిని జావలాగా చేసుకొని,లేదంటే పచ్చివి, తీసుకోవడం వాళ్ళ ఎంతగానో ప్రయోజనం ఉంటుంది.
వీటిలో పీచు పదార్థాలు,ఒమేగా 3,ప్రోటీన్స్,విటమిన్స్ ఉండడం వల్ల మన ఆరోగ్యానికి చాల బాగా మేలు చేస్తాయి.
28గ్రా ల చియా గింజలలో లభ్యమయ్యే పోషకాలు:-
– 177 మిల్లి గ్రా కాల్షియం
– 1 మిల్లి గ్రా జింక్
– 1 మిల్లి గ్రా,, కాపర్
– 8 మిల్లి గ్రా పొటాషియం
– 256 మిల్లి గ్రా ఫాస్పర్
– 6గ్రా ఫైబర్
-6 గ్రా ఫ్యాట్స్
-4 గ్రా ప్రోటీన్స్
-3 గ్రా పిండి పదార్థాలు
– 137 కెలోరీలు శక్తి
ఇలా మన శరీరానికి కావలసిన పోషక విలువలు అందుతాయి.
chia seeds in Telugu చియా గింజలద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:-
1. ఆకలి,నిద్ర,మానసిక లక్షణాలు ను మెరుగు పరుస్తుంది.
2. వీటిలో ఉండే ప్రోటీన్స్,జింక్,మినరల్స్ వల్ల చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది. జుట్టు,గోర్లు,ఎంతో ఆరోగ్యవంతగా పెరుగుతాయి.
3. ఈ గింజలలో ఉండే కాల్షియం ఎముకలను ఎంతో దృడంగా ఉంచుతుంది.
4. ఇందులోని ఔషధ గుణాలు ఇన్సులిన్ స్థాయిని నియంత్రిస్తూ రక్తంలోని చెక్కర మోతాదును సరిపోయేలా చేస్తుంది.
5. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఈ చియా గింజలు ఎంతగానో మేలు చేస్తాయి.
6. అదేవిదనగా ఫైబర్,ప్రోటీన్స్,ఉండడం వల్ల పొట్ట నిండుగా ఉన్నట్టు అనిపించి తక్కువ మోతాదులో మనం ఆహారం తీసుకోవడం ద్వారా బరువు పెరుగుదలను ఆపుతుంది.
7. D N A తయారీకి ఎంతగానో సహకరిస్తుంది.
8. వీరిలో యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని యవ్వనంగా ఉంచుతాయి.
9. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
10. శరీర పని తీరును మెరుగు పరుస్తుంది.