Tollywood news in telugu
‘చెక్’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్ !

క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ దర్శకత్వం లో రాబోతున్న సినిమా ‘చెక్ ‘ , ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మూవీలో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లగా నటిస్తున్నారు.
ఇందులో ఆదిత్య అనే పాత్రలో నితిన్ నటిస్తుంన్నారు. ఈ ఆదిత్యకి ఒక కళ కూడా ఉంది అదే చెస్ ఆడటం. అంత అద్భుతంగా చెస్ ఆడే వ్యక్తి జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే కథాంశం పై ఈ సినిమా సాగనుంది అని తెలుస్తుంది.
ఇప్పటికే సినిమా టీజర్ విడుదలకావడంతో ఈ సినిమాపై బారి అంచనాలు పెరిగాయి. ఈ మూవీలో రకుల్ లాయర్ గా నటించగా, ప్రియా ప్రకాష్ వారియర్ నితిన్ కి ప్రియురాలిగా నటించినట్టు టాక్ . ఈ సినిమా ఫిబ్రవరి 19 న రిలీజ్ కానుంది.